పవన్ వీరాభిమాని ఈసారి ఇలా చేశాడేంటి!!

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ లేరు..... తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులం అని చెప్పుకునే హీరో, హీరోయిన్స్ చాలామందే ఉన్నారు ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ స్టైల్ ని వారు తమ సీన్లలో వాడుకుంటూ.... పవన్ తనకు దేవుడంటూ లెక్చర్లిస్తుంటారు. ఇలాంటి వారిలో టాలీవుడ్ లో ముందుండే వ్యక్తి మాత్రం నితిన్,. నితిన్ కి గతంలో సినిమాల్లో చాలా ఎదురు దెబ్బలే తగిలాయి. కానీ మళ్ళీ పవన్ కి నేను వీరాభిమానినంటూ మొదలుపెట్టి సినిమాల్లో హిట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు.
ఇక తన సినిమాల వేడుకలకి పవన్ కళ్యాణ్ ని తీసుకువచ్చి మరీ తన సినిమాకి పబ్లిసిటీ చేయించుకునే నితిన్ ఇప్పుడు మాత్రం పవన్ ని పక్కన పెట్టేసాడంటున్నారు కొందరు. ఎందుకంటే నితిన్ - హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'లై' చిత్రం ఈ నెల 11 న విదుడవుతున్న సందర్భంగా ఈ సినిమా కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే 'లై' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ మహేష్ గెస్ట్ గా వస్తున్నాడనే టాక్ వినబడుతుంది.
మరి నితిన్ దేవుడు పవన్ ఉండగా... మహేష్ ని ఎందుకు పిలిచాడా అనుకుంటున్నారా? అదేనండి 'లై' సినిమాని నిర్మించిన 14 రీల్స్ వారికీ సూపర్ స్టార్ మహేష్ కి ఉన్న అనుబంధం మూలంగానే మహేష్ ఈ ఈవెంటుకి వస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇందులో హీరో నితిన్ గారి తప్పేం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ ని మర్చిపోలేదు. కానీ నిర్మాతల డెసిషన్ తో ఏకీభవించాడు కాబట్టే నితిన్ ని ఇలా తప్పుగా అనుకుంటున్నారట.

