Wed Dec 31 2025 14:57:58 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ విశాఖకు వస్తానని మాట ఇచ్చార్ట

త్వరలో అంటే దసరా కానుకగా అక్టోబర్ 6న తెలుగు, కన్నడ భాషల్లో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్కుమార్గౌడను హీరోగా పరిచయం చేస్తూ, రాజమౌళి శిష్యుడు మహదేవ్ డైరెక్షన్లో, దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈచిత్రం 'జాగ్వార్' విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగులో ఇంతకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'అల్లుడుశీను', నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అఖిల్' చిత్రం కోసం దాదాపు 40కోట్లు ఖర్చుపెడితే మనం ఆశ్చర్యపోయాం. కాగా 'జాగ్వార్'ను ఏకంగా 75కోట్లతో రూపొందిస్తు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆర్దికంగా ఎంతో బలమైన కుమారస్వామి తన తనయుడు హీరోగా పరిచయం చేస్తున్న సమయంలో ఈ చిత్రానికి ఆ మాత్రం ఖర్చుపెట్టకపోతే ఎలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆడియో విడుదలకు పవన్ హాజరుకాలేకపోయినా విశాఖలో జరిగే సక్సెస్మీట్కు హాజరవుతానని మాట ఇచ్చాడట.
అంటే సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం ఎలా ఉన్నా.. భారీ ఎత్తున ఈ సక్సెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక తన కుమారుడు నటించే రెండో చిత్రాన్ని కూడా తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకరు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇక తనకు ఇష్టమైన హీరో పవన్‌కళ్యాణ్ హీరోగా కుమారస్వామి నిర్మాతగా ఓ చిత్రం రూపొందనుందని సమచారం. మొత్తానికి నిఖిల్‌గౌడ బ్యాగ్రౌండ్ ఇలా ఉన్నప్పుడు ఆయన మొహాన్ని ప్రేక్షకులకు నచ్చేలా రుద్దేవరకు కుమార్‌స్వామి ఊరుకునేటట్లు కనిపించడం లేదు. అంతే గా మరి హారో గా నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ప్రతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు.
ఒకప్పుడు అంటే మొదటి 'చిరుత' సినిమాలో రామ్ చరణ్ ని చూసినవారంతా ఇతనేంటి హీరో ఏమిటి అనుకున్నవారంతా... రామ్ చరణ్ అదృష్టం ఏమోగానీ రాజమౌళి చేతిలో పడ్డాక చరణ్ సుడి తిరిగింది. ఇంకేముంది 'మగధీర' చూసాక.... తర్వాత వచ్చిన సినిమాలతో రామ్ చరణ్ ముఖానికి అలవాటు పడిపోలేదా.... అలాగే ఇప్పుడు నిఖిల్ మొదటి కొన్ని సినిమాలల్లో అతన్ని చూడ్డం ప్రేక్షకులకు పెద్ద పరీక్షే. కొన్ని సినిమాల తర్వాత అతని ముఖానికి మెల్లగా అలవాటు పడిపోతారులే అని కొంతమంది సెటైర్స్ వేస్తున్నారు.
Next Story

