పవన్ పై షాకింగ్ న్యూస్!!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్. తనకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మన టాలీవుడ్ లో ఏ హీరోకి వుండకపోవొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ పై ఓ గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ తర్వాత ఏ డైరెక్టర్ తో చేస్తాడని అభిమానుల్లో చేర్చనీయాంశంగా మారింది.
త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ తో ఓ సినిమా సైన్ చేసాడని తెలిసింది. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా.. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ అక్షరాలా 40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అవును మీరు విన్నది కరెక్టే... అక్షరాలా 40 కోట్ల రెమ్యునరేషన్ పవన్ మైత్రి మూవీస్ నుండి అందుకోనున్నాడట. అయితే మరో షాకింగ్ విషయమేమిటంటే ఈ సినిమా కి హరీష్ శంకర్ దర్శకుడు అని ప్రచారం జరుగుతుంది.
ఇక పవన్ పారితోషకం వినడానికి షాకింగ్ గా వున్నా... ఇది నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇదే కనుక నిజం అయితే ఈ సినిమా యొక్క మార్కెట్ రెండు వందల కోట్లు పైనే జరుగుతుందంటున్నారు. చూద్దాం పవన్ నిజంగానే 40 కోట్లు అందుకుంటాడా? అలాగే హరీష్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తాడా? అనేది కూడా..! లేకపోతె ఇది ఒక కాస్ట్లీ రూమర్ గానే ఫిలింనగర్ సర్కిల్స్ లో మిగిలిపోతుందా అనేది.

