పవన్ తన కొడుకుని తీసుకుని అన్నావదినల దగ్గరికెళ్ళడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముచ్చటగా చేసుకున్న మూడో భార్య అయిన అన్నా కి ఇటీవలే ఒక కొడుకు పుట్టిన సంగతి అందరికి తెలిసిందే. పుత్రోత్సాహంతో కొడుకు పుట్టిన నెక్స్ట్ డేనే ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ అని తన కొడుక్కి పేరు పెట్టాడు పవన్ కళ్యాణ్. ఒక పక్క బాబు పుట్టడం... మరోపక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో పాల్గొనడం.. మరోపక్క జనసేన కార్యక్రమాలతో బిజీగా వున్నా పవన్ కళ్యాణ్ తన కొడుకుని పుట్టగానే... తన అన్న చిరు వదిన సురేఖ కి చూపించలేకపోయాడట.
అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి తన రెండో కొడుకుని తన అన్నావదినలకి చూపించడానికి బాబుని తీసుకొని చిరంజీవి ఇంటికి వెళ్ళాడట. ఈ విషయాన్నీ రామ్ చరణ్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంతేకాకూండా పవన్ కళ్యాణ్ కి కొడుకు పుట్టిన టైం లో చిరంజీవి భార్య అయిన సురేఖ కి ఒంట్లో బాలేదట. ఇక వదిన కి ఒంట్లో బాలేదు అని తెలియాగానే తన కొడుకుని తీసుకొని చిరంజీవి ఇంటికి వెళ్ళాడట పవన్ కళ్యాణ్. అక్కడ సురేఖ కి తన బాబుని చూపించి పేరు చెప్పి కాసేపు గడిపి వచ్చాడట పవన్ కళ్యాణ్.
మరి చిరు, సురేఖ తనకి అన్నావదినాలే కాదు తల్లితండ్రులతో సమానమన్నట్టు చెబుతుంటాడు పవన్. కానీ వారిమధ్యన ప్రేమ ఆప్యాయతలు ఎంతగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయమై మెగా ఫ్యామిలి విభేదాలు అంటూ బయట అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంటుంది. ఒక్కోసారి మా మధ్యన ఏం లేదని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ విధమైన పుకార్లకు మెగా ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు.

