పరిస్థితి దీనం

స్టార్ హీరోలకి వరసబెట్టి ఐదు ఆరు ప్లాప్స్ వచ్చినా ఒక్క సినిమా హిట్ పడితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారు. ఏళ్ళ తరబడి హిట్స్ లేని హీరోస్ కూడా మళ్లీ ఫామ్ లోకి వచ్చినా దాఖలాలు కూడా వున్నాయి. కానీ చిన్న హీరోస్ పరిస్థితి ఆలా కాదు. రెండు మూడు ప్లాప్స్ పడితే ఇంక అంతే సంగతులు.
మంచి విజయాలు అందుకున్న కూడా కనుమరుగు అయిన హీరోలు చాలా మందే వున్నారు టాలీవుడ్ లో. అందుకే చిన్న హీరోస్ తమ కెరియర్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఆచి తూచి అడుగులు వేయాలి. ఆలా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టే నాని.. శర్వానంద్ లకు పెద్ద నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వరస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న హీరోస్ చాలా మందే వున్నారు.
ప్రస్తుతం సందీప్ కిషన్ పరిస్థితి కూడా ఇంతే. తన లేటెస్ట్ మూవీ 'మనసుకు నచ్చింది' కూడా డిజాస్టర్ అవడంతో ఈ యువ హీరోకి ఇక అవకాశాలు ఇచ్చేదెవరనే ప్రశ్న తలెత్తుతోంది. గత 5 ఏళ్ళ నుండి సరైన హిట్ లేదు ఈ హీరోకి. ఏదన్నా మిరాకిల్ జరిగి తన నెక్స్ట్ మూవీస్ హిట్ అయితే తప్ప మళ్లీ నిలదొక్కుకోవడం కష్టమనిపిస్తోంది. మరి ఈ సమస్యని అతను ఎలా అధిగమిస్తాడనేది చూడాలి.

