'పద్మావతి'పై కమల్ కామెంట్

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ చిత్రం పై ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆగ్రహజ్వాలలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ చిత్రాన్ని తమ రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని ఆ రాష్ట్ర సంఘాలు ప్రకటించాయి. కొందరు ఏకంగా ఆ చిత్రంలో ‘పద్మావతి’ పాత్రలో నటించిన దీపికా పదుకొణె , దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలను తీసుకువస్తే వారికి అయిదు కోట్లు , 10 కోట్లు నజరానా అని ప్రకటించారు. వివిధ కారణాల వల్ల ‘పద్మావతి’ చిత్రం వాయిదా పడింది.
తాజాగా ఈ విషయం పై తమిళ నటుడు కమల్ హాసన్ స్పందించాడు. 'నాకు దీపిక శిరస్సు కావలి, దానిని దాచుకుంటా! ఆమె శరీరం కంటే ఆమె శిరస్సుకే ఎక్కువ గౌరవం ఇవ్వండి. నా చిత్రాలను కూడా ఎన్నో సంఘాలు అడ్డుకున్నాయి. ఏ వాదనలోనైనా అతి ఎక్కువ అయినపుడు అది మంచిది కాదు. మేలుకో భారత్.... ఆలోచించడానికి తగిన సమయం ఇది. మనం ఎన్నో అన్నాము.... అంటూ కమల్ హాసన్ అన్నాడు.
కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ ‘విశ్వరూపం – 2’ చిత్రాలు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. విశ్వరూపం – 2 చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు

