పక్కా గా బిగ్ హిట్

లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమాపై మొదటి నుండి బాగానే అంచనాలు వున్నాయి. ఇందుకు కారణం రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి చరణ్ ఎలా ఉంటాడో.. అసలు చరణ్ పాత్ర ఏంటో..అని అందరిలో ఓ ఆసక్తి నెలకొంది. మరి టీజర్ ఎలా ఉందొ చూద్ద్ధం పదండి.
ఇందులో మనవాడి పాత్ర పేరు చిట్టి బాబు.. కానీ అందరు సౌండ్ ఇంజనీర్ అని పిలుస్తారు. ఎందుకంటె మనవాడికి వినికిడి సమస్య వుంది. అందుకు సౌండ్ ఇంజనీర్ అని పేరు వచ్చింది. కానీ మనవాడికి వినపడకపోయిన..పెదాలను బట్టి చదివేస్తూ నెట్టుకొచ్చేస్తుంటాడు. ఇందులో చరణ్ మాస్ లుక్ సినిమాకి హైలైట్ కానుంది. లుంగీ కట్టుకుని గెడ్డం పెంచుకుని పాత్రలో అతను పరకాయ ప్రవేశం చేసిన తీరు ఆ పాత్రను ఇంకా బాగా రక్తికట్టించింది. ఇక గోదావరి జిల్లాలో జరిగే కథ కాబ్బట్టి అక్కడ వాడే స్లాంగ్ తోనే మనవాడు కూడా మాట్లాడటం మాస్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తుంది.
ఇక టీజర్ లాస్ట్ లో చేతిలో కొడవలి పట్టుకుని రామ్ చరణ్ నడిచొస్తుంటే.. వెనుక ఆ మాస్ మ్యూజిక్ చూస్తుంటే..ఇది కచ్చితంగా హిట్ బొమ్మ అని చెబుతున్నారు ఫిలింనగర్ జనాలు.అలానే ఎప్పటిలానే దేవి మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా వుంది. మరి టీజర్ ఈ రేంజ్ లో ఉంటే ట్రైలర్ అండ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫాన్స్ ఇప్పటి నుండే పండగ జరుపుకుంటున్నారు.