పక్కా అంటున్నా... డౌట్ డౌటే అంటున్నారు

'జై లవ కుశ' చిత్రంపైన బోలెడన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు సినిమాని సెప్టెంబర్ 21న ఎలా రిలీజ్ చేస్తారు. సినిమా సెప్టెంబర్ 21న రావడం కల్లే అంటూ న్యూస్ హల్చల్ చేస్తున్న వేళ 'జై లవ కుశ' ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ అవన్నీ ఒట్టి గాసిప్స్ మేము ఖచ్చితంగా సెప్టెంబర్ 21 నే వస్తున్నామని.. ఆ డేట్ ని ఎట్టిపరిస్థితుల్లో మిస్ అయ్యేది లేదని అధికారిక ప్రకటన ఇచ్చాడు. మరి కళ్యాణ్ రామ్ అయితే పక్కా అంటున్నాడు గాని సినిమాకి సంబందించిన షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ రెండు పాటల బ్యాలెన్స్ ఉందంటున్నారు మరోపక్క.
ఇక సినిమా విడుదలకు డేట్ కేవలం ఒక నెల మాత్రమే ఉంది. ఈ ఒక్క నెలలోనే ఎన్టీఆర్, బాబీ లు సినిమా పాటలు కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చెయ్యగలరంటారా? అనే డౌట్ ప్రతి ఒక్కరిలో రోజు రోజుకి ఎక్కువైపోతోంది. నిజంగానే ఎన్టీఆర్ ఒక పక్క బిగ్ బాస్ కోసం వారానికి రెండు రోజులు కేటాయించేస్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ షూటింగ్ కూడా ఎన్టీఆర్ కి సంబందించిన 10 రోజుల కాల్షీట్స్ వున్నాయి. మరి నెలలో 10 రోజులు బిగ్ బాస్ కోసమే కేటాయిస్తే మిగిలిన 20 రోజుల్లోనే పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సినిమా పబ్లిసిటీని ఎలా పూర్తి చేస్తారనే దాని మీద ఫిలింనగర్ లో ఎడతెగని చర్చ స్టార్ట్ అయ్యింది.
అందులోను 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నాడు. ఎదో ఒక కేరక్టర్ అంటే గనక ఎలాగో మానేజ్ చేసేయ్యొచ్చు. కానీ మూడు పాత్రల్లో ఏది తేడా కొట్టినా అది కచ్చితంగా సినిమా మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది. మరి డైరెక్టర్ బాబీపై ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతె ఆయన నిర్మాత కళ్యాణ్ రామ్ మా సినిమా ఖచ్చితంగా సెప్టెంబర్ 21 నే వస్తుందని చెబుతాడు. అలాగే ఫాన్స్ ని కూడా కంగారు పడకండి కరెక్ట్ డేట్ కే మన సినిమా వచ్చేస్తుంది అంటూ భరోసా కూడా ఇచ్చేస్తున్నాడు. మరి ఇంత స్పీడు గా డైరెక్టర్ బాబీ సినిమాని ఎలా తెరకెక్కించాడో.... ఎమన్నా హరి బరి చేస్తే సినిమా ఫలితం తేడా కొట్టేసే ప్రమాదం ఉందంటూ ఎన్టీఆర్ అభిమానులు తెగ ఇదైపోతున్నారు.

