నేను... మీదాన్నే!

మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో అడుగు పెడుతున్న ఈ భామ.... నేను హైదరాబాద్ అమ్మాయినే గుర్తించండి అంటుంది.
ఇక్కడ సెటిల్ అవ్వాలనేమో...
అయితే ఈ అమ్మడు ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటుందేమో.. తాజాగా ప్రకటించిన నంది అవార్డ్స్ లో డైరెక్టర్ చందూ మొండేటికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కార్తికేయ చిత్రానికి అవార్డు వచ్చింది. తన డైరెక్టర్ చందు కి బెస్ట్ విషెస్ చెబుతూ.... నిధి అగర్వాల్..చందూ మొండేటితో ఓ సెల్ఫీని దిగి.... ఇప్పుడు సవ్యసాచి మూవీ తొలి షెడ్యూల్ పూర్తయిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కార్తికేయ చిత్రానికి నంది అవార్డ్ గెలుచుకున్నందుకు.. ఈ దర్శకుడికి అభినందనలు కూడా చెబుతోంది.
సత్తా చాటుతుందా?
ఇక రానున్న సినిమాల్లో మంచి పాత్రలు చేస్తే ఈ భామ కి తిరుగుండదని.... సమంత లా ఇండస్ట్రీని ఎల్ కెపాసిటీ ఈ హీరోయిన్ కు ఉంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.యాక్టింగ్.. డ్యాన్సింగ్.. అందచందాలు.. ఆరబోతలు.. అన్నీ ఉన్న ఈ భామ.. టాలీవుడ్ లో సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని..టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో త్వరగానే చేరిపోతుందని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- Tags
- నిధి

