నెల టిక్కెట్ కోసం అంత భారీగా?

రెండేళ్ల భారీ గ్యాప్ తీసుకున్న రవితేజ ఆ తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ తన ఫాన్స్ ని హ్యాపీ మూడ్ లో ఉంచుతున్నాడు. గత ఏడాది 'రాజా ది గ్రేట్' తో హిట్ అందుకున్న రవితేజ ఈ ఏడాది 'టచ్ చేసి చూడు' తో వైఫల్యాన్ని అందుకున్నప్పటి కి తన జోరుని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ఒకేసారి కళ్యాణ్ కృష్ణ, శ్రీను వైట్లతో సినిమాలు చేస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ తో 'నెల టిక్కెట్' అనే మాస్ టైటిల్ తో సినిమా చేస్తున్న రవితేజ పక్కన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మాస్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని చెబుతున్నాడు దర్శకుడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న 'నెల టిక్కెట్' సినిమా కి సంబందించిన సెట్ ఒకటి ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో భారీ గా సెట్ వేసి అక్కడ 'నెల టిక్కెట్' షూటింగ్ జరుపుతున్నారట. మరి ప్రత్యేకంగా వేసిన ఈ సెట్ లో నెల టిక్కెట్ కి సంబందించిన ముఖ్య పాత్రల కి సంబందించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తుంది.
ఇక విరామ లేకుండా ఈ సినిమా షూటింగ్ లో రవితేజ పాల్గొంటున్నాడని.. ఈ సినిమా షూటింగ్ ని మే మొదటి వారానికల్లా పూర్తి చేసి మే చివరి నాటికీ విడుదల చెయ్యడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. అందుకే చక చకా షూటింగ్ కానిచ్చేస్తున్న 'నెల టిక్కెట్' ఫస్ట్ లుక్ కూడా రేపు ఉగాది సందర్భంగా విడుదల చేసి సినిమాపై అందరిలో క్యూరియాసిటీ పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

