నీ అందం ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే!

బాలీవుడ్ లో సెన్సేషన్స్ సినిమాలు తీసే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ప్రస్తుతం రాజపుత్ రాణి పద్మావతి జీవిత గాథతో భారీ బడ్జెట్ తో పద్మావతి సినిమా తెరకెక్కించాడు. ఇందులో పద్మావతి భర్త రాజా రావల్ రతన్ సింగ్ పాత్ర షాహిద్ కపూర్ చేశాడు. అయితే షాహిద్ కపూర్ అసలు భార్య కూడా రాజ్ పుత్ వంశానికి చెందిన అమ్మాయే కావడం విశేషం. ఆమె అసలు పేరు మీరా రాజ్ పుత్.
షాహిద్ - మీరాల జంట మొట్టమొదటి సారిగా ఓ మ్యాగజైన్ కు ఫోజులిచ్చారు. అయితే వీరు ఇచ్చిన ఫోజ్ కు సోషల్ మీడియాలో మంచి పేరు వచ్చింది. అదే మ్యాగజైన్ వాళ్ళు మీరాను సెపెరేట్ గా ఒక ఫోటో తీశారు. ఈ ఫొటోలో మీరా రాజహంసను మించిన ఠీవితో.. కళ్లు తిప్పుకోలేని రాజసంతో... అబ్బురపరిచే సొగసుతో అందరిని మెస్మరైజ్ చేసింది. రోజ్- గోల్డ్ కలర్ లెహంగాపై వైట్ బ్లౌజ్ యాంటిక్ నగలతో క్లీవేజ్ అందాలన్నీ ప్రదర్శించింది. మీరా ఇచ్చిన స్టిల్ ముందు బాలీవుడ్ హీరోయిన్ లు కూడా దిగదుడుపే అనేలా ఉందా పిక్.
మొదటినుండి షాహిద్ కపూర్ వైఫ్ మీరా సినిమాల్లోకి వస్తానంటే ఆమెను డైరెక్ట్ చెయ్యడానికి చాలామంది దర్శకనిర్మతలు వెయిట్ చేస్తున్నారు. కానీ మీరా మాత్రం తన భర్త, తన పాపా మాత్రమే ప్రపంచం అన్న చందం గా ఉంటూనే భర్త తో కలిసి ఇబయటికి అంటే.... ఏమైనా ఈవెంట్స్ కి అటెండ్ అయినప్పుడు మాత్రం...బాలీవుడ్ హెరోయిన్స్ తలదన్నే రీతిలో ఎంతో అందంగా.... డిజైనర్ డ్రెస్సులతో అందరి చూపులను తనవైపు తిప్పేసుకుంటుంది.
ఇక ఇప్పుడు హీరోయిన్స్ ని తలదన్నే రీతిలో మీరా ఇచ్చిన ఫోజ్ కి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో కుర్రకారు లైక్ లు మీద లైక్ లు కొడుతూ 2 లక్షలు దాటిపోయాయంటే మీరా రాజ్ పుత్ సొగసు ఏ మేరకు మాయ చేసిందో చెప్పేయొచ్చు.

