నిర్మాతను ఆదుకుంటున్న స్టార్ హీరో?

ప్రభాస్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా ఏదంటే 'బాహుబలి' కాకుండా మనకు గుర్తొచ్చేది 'వర్షం' సినిమా. ఈ సినిమా ప్రభాస్ లైఫ్ టర్నింగ్ మూవీ అని చెప్పుకోవొచ్చు. అయితే అంతకుముందు అతను చేసిన ‘ఈశ్వర్’.. ‘రాఘవేంద్ర’ సినిమాలు అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయితే 'వర్షం' మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యి ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.
మరి అంతటి బ్లాక్ బస్టర్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత ఎం.ఎస్.రాజు అన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ మొదటి రెండు సినిమాలు 'ఈశ్వర్’.. ‘రాఘవేంద్ర’ అంతగా అతనికి పేరు తెచ్చిపెట్టలేదు. అప్పటికే ఫామ్ లో వున్న ఎం.ఎస్.రాజు... ప్రభాస్ లైఫ్ సెట్ చేయటానికి 'వర్షం' సినిమా తీసాడు. ఆ రకంగా ప్రభాస్ కు ఎం.ఎస్.రాజు పెద్ద సాయం చేసినట్లే.
అయితే ఇప్పుడు ఆ సాయాన్ని గుర్తు పెట్టుకుని మరీ రుణం తీర్చుకునే పనిలో పడ్డాడట ప్రభాస్. నిర్మాతగా ఒడిడుకులు ఎదుర్కొంటున్న ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ కు ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ ఇప్పించాడట. ఇటీవలే సుమంత్ అశ్విన్ - కొణిదెల నిహారిక ఒక సినిమా కూడా స్టార్ చేసారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోంది. ఆ సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్ లు ప్రభాస్ ఆప్త మిత్రులన్న సంగతి తెలిసిందే. 'మిర్చి' సినిమాతో ఈ ప్రొడ్యూసర్స్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇటీవలే ‘మహానుభావుడు’తో హిట్ కొట్టారు. ఇప్పుడు ప్రభాస్ తో 'సాహో' లాంటి పెద్ద ప్రాజెక్ట్ ను తీస్తున్నారు. సుమంత్ అశ్విన్ - కొణిదెల నిహారిక సినిమాకు హీరోగా సుమంత్ అశ్విన్ ని తీసుకోమని సూచించాడంట ప్రభాస్. ప్రభాస్ సూచన మేరకే వాళ్లు అతడిని హీరోగా తీసుకున్నారట. మొత్తానికి ఎం.ఎస్.రాజు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని ప్రభాస్ ఆయనకిలా సాయం చేయడం గొప్ప విషయమే.

