నాస్తికుడై ఉండి ఇది భగవంతుడి సృష్టి అంటున్నాడే

స్వతహాగా నాస్తికుడైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. అది ఒక చలన చిత్రమైనా, ట్వీట్ అయినా, ఇంటర్వ్యూ అయినా వర్మ ప్రమేయం ఉంటే మరెలాంటి పబ్లిసిటీ ఖర్చులు లేకుండా వర్మ ప్రయత్నాన్ని ప్రేక్షకులందరు గుర్తించేస్తారు. అలాంటి వర్మ తన శైలిలో సెక్స్ గురించి చెప్తూ చేసిన వీడియో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ కూడా అదే స్థాయిలో సంచలనం అవుతుండటం విశేషం. 26 న విడుదల కానున్న జి.ఎస్.టి పూర్తి వీడియో పై ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు పిల్లలని చెడగొట్టే విషయాలు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వర్మ చేయటం పై అభ్యంతరాలు తెలియజేస్తూ ఆ వీడియో విడుదలపై నిరసన తెలుపుతున్నారు.
ఈ అభ్యంతరాలన్నిటికి సమాధానం ఇస్తూ రామ్ గోపాల్ వర్మ, "పిల్లలని చెడగొట్టే విషయాలు ఏమి నేను చెప్పటం లేదు. అందరూ ఎవరికి కుదిరిన విధానాన వారు పోర్న్ చూస్తున్నారు. నేను చేసిన జి.ఎస్.టి వీడియో పోర్న్ వీడియో కాదు. నేను సెక్స్ అనే అంశాన్ని ఎంత పవిత్రంగా చూస్తానో నా దృష్టి కోణంలో నుంచి సెక్స్ పై నా అవగాహన ని చెప్తూ చేసిన వీడియో మాత్రమే." అని వివరించారు వర్మ. ఇక పోతే అసలు జి.ఎస్.టి పోర్న్ ఆ కాదా అనేది ఫుల్ వీడియో వచ్చాక తెలుస్తుంది అనుకోండి. కానీ వర్మ సెక్స్ గురించి తన దృష్టి కోణంలో తాను నమ్మినదాని గురించి చేసిన వీడియో అని కుండా బద్దలు కొడుతుండటంతో మరో ప్రశ్న తలెత్తుతుంది. భగవంతుడి సృష్టిలో అతి సుందరమైన కార్యం అని సెక్స్ కి నిర్వచనం ఇస్తూ జి.ఎస్.టి ట్రైలర్ విడుదల చేసిన వర్మ అసలు దైవ శక్తీ అనేది ఏది లేదని తన నమ్మకం అంటూ ఎన్నో మార్లు చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పటికిప్పుడు భగవంతుడు సృష్టి అని తాను నమ్మే విధంగా మారిపోయాడా లేక పరిస్థితికి తగట్టు అవసరార్ధం మారిపోయాడా? ఈ ప్రశ్న కి సమాధానం వర్మకే తెలియాలి