Sun Dec 21 2025 22:23:42 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగేళ్ల ఆలస్యంగా వచ్చినా సక్సెసే

శుక్రవారం విడుదల అయిన యువ నటుడు నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ కలెక్షన్స్ లో కన్సిస్టెన్సీ నిలుపుకుంటుంది. ఈ చిత్రాన్ని టైగర్ ఫేమ్ దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించగా కథానాయకుడు నిఖిల్ సరసన హెబ్బా పటేల్ తో పాటు నందిత శ్వేతా నటించారు. నందిత శ్వేతా కు ఇదే తెలుగులో తొలి చిత్రం. ఈ చిత్రం చుసిన వారందరు నందిత శ్వేతా నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే తొలి చిత్రం అయినప్పటికీ గత నాలుగేళ్లుగా అనేక చిత్రాలతో తెర వెనుక సంబంధాలు వున్నాయంటే నందిత శ్వేతా కి.
తమిళంలో ఇప్పటికే పలు చిత్రాలలో నటించి విజయాలు కూడా తన ఖాతాలో వేసుకున్న నందిత శ్వేతా కి తన టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో నాలుగేళ్ల కిందట జరగాల్సింది అంట. అయితే కొన్ని చిత్రాలకు అవకాశం వచ్చినా చిత్రేకరణ దశకు చేరుకునే వరకు ఆ అవకాశాలు నిలిచేవి కాదు అంట. ఇలా తెలుగు సినిమాల్లో ఎంట్రీ కి ఎన్ని ఆటంకాలు ఎదురు అయినా తెలుగు సినిమా పై ఆశ ఉండేది అంట నందిత శ్వేతకి. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా విజయంతో ఆమెకు అనేక చిత్రాల అవకాశాలు దక్కుతున్నాయంట. ఆలస్యం అయినా విజయవంతమైన సినిమాతో ఎంట్రీ ఇస్తే వుండే అడ్వాంటేజెస్ నందిత శ్వేతా కు బాగా కలిసి వస్తునట్టున్నాయి.
Next Story

