నాని కోసం బాలీవుడ్ నటుడు దిగుతున్నాడు!!

ఇప్పుడు టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నాని ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి నాని వచ్చేసాడు. చేస్తున్న ప్రతి సినిమా హిట్ అవడంతో నానికి టాలీవుడ్ లో ఎదురు లేకుండా పోయింది. ఇక నాని మరీ ఓవర్బడ్జెట్తో సినిమాలు చేయాలని నిర్మాతలకు కండీషన్ పెట్టడు. తనకోసం స్టార్ హీరోయిన్లు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల కోసం రికమెండేషన్స్ చేయడు. కథ నచ్చి, దర్శకుడి మీద బాగా తీయగలడనే నమ్మకం, నిర్మాత సినిమాను నిలబెట్టి, ప్రమోషన్స్ చేయగలిగితే చాలు మినిమం బడ్జెట్‌తో కానిచేస్తాడు.
అలాగే నాని తన రెమ్యూనరేషన్‌ని కూడా మిగిలిన వారిలా డిమాండ్ సప్లై విధానంలో గాక చూసిచూడనట్లు పోతుంటాడు. అలాగే నిర్మాతలకు ఓ ఐదారు కోట్లు మిగిలేలా, లేదా సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు, బయ్యర్లు సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాడు. ఒకే చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ చెప్పి, ఏడాదంతా వారికే డేట్స్ దారాదత్తం చేయడం కంటే ఎక్కువ సినిమాలు స్పీడ్‌గా, వేస్టేజ్ లేకుండా తీయడానికి మక్కువ చూపుతాడు..... కాబట్టే అతను ఎవరి అండదండలు లేకుండా నేచురల్ స్టార్ కాగలిగాడు. ఇక దిల్‌రాజు రూట్ అందరికీ తెలిసిందే, దర్శకునికి ఏమి కావాలి? ఎవరు కావాలి? అనేవన్నీ ఆయన సమకూరుస్తాడు.
అయితే దిల్ రాజు నిర్మాతగా ప్రసుత్తం నాని హీరోగా సాయిపల్లవి హీరోయిన్గా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) వేణుశ్రీరాం డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇందులోని ఓ కీలకపాత్రను ఓ బాలీవుడ్ నటుడి చేత చేయించాలని దర్శకుడు భావించాడు. దానికి దిల్‌రాజు ఓకే చెప్పాడు. అతనెవరో కాదు.. హైదరాబాద్‌లో థియేటర్ ఆర్ట్స్ చేసి 'పింక్' చిత్రంలో తనదైన నటనతో బాగా ఆకట్టుకున్న విజయ్‌వర్మ. ఆయనకు దర్శకుడు వేణుశ్రీరాం కథను నేరెట్ చేయగానే ఇంప్రెస్ అయి ఓకే చెప్పేశాడట. ఇతను ప్రస్తుతం తనకు తెలుగు రాదని, అందుకే దానిని ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. థియేటర్ఆర్ట్స్ నుంచివచ్చాడు కాబట్టి ఆయాభాషలను నేర్చుకోవడం పట్ల ఆయన తన మక్కువ చూపిస్తున్నాడు. ఈచిత్రం హిట్టయితే టాలీవుడ్‌కి మరో విలక్షణ నటుడు దొరికినట్లేనని చెప్పాలి.

