నాకేం భయం లేదంటున్నాడు!!

కోలీవుడ్ లో బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న కమల హాసన్ ని అరెస్ట్ చెయ్యాలంటూ హిందూ మక్కల్ కట్చచి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో వల్ల తమిళ సంస్కృతికి భంగం కలుగుతుందంటూ హిందూ మక్కల్ కట్చచి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బిగ్ బాస్ షోని వెంటనే ఆపేయాలని ఆ షో కి హోస్ట్ గా చేస్తున్న కమల్ ని వెంటనే అరెస్ట్ చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హిందూ మక్కల్ కట్చచి ఆరోపణ పట్ల కమల్ హాసన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించాడు. తాను ఎట్టిపరిస్థితుల్లో ఈ షో చేస్తానని... నాకు అని వర్గాల ప్రేక్షకులు ముఖ్యమే అని చెప్పాడు. ఇకకేసు విషయం అంటారా... నాకు ఆ కేసు విషయంలో ఎలాంటి భయం లేదని..... నాకు ఈ న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకముందని చెబుతున్నాడు. ఇక నాపై కేసు వేసిన వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. అసలు నిజాల్ని చూపించడం అంటే సంస్కృతిని నాశనం చెయ్యడం ఎలా అవుతుంది... అంటూ ఎదురు ప్రశ్న వేసాడు.
ఎప్పటినుండో బాలీవుడ్ లో బిగ్ బాస్ షో రన్ అవుతుంది. అక్కడ ఆ షోలో ఎన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఆ షో మీద అక్కడెవరూ కేసులు గట్రా పెట్టలేదు. అక్కడలేని బాధ ఇక్కడెందుకు వచ్చింది అంటూ సమాధానం చెప్పాడు. ఇంకా మనదేశంలో క్రికెట్ ఎంతఅవసరమో బిగ్ బాస్ అంతే అవసరంటూ చమత్కరించాడు.

