నాకు యంగ్ హీరో కావాలంటుంది

బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక పాప ఆరాధ్య బచ్చన్ కి మంచి తల్లిలా....ఉంటూ ఆరాధ్య కొంచెం పెరిగి పెద్ద కాగానే సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్ ని స్టార్ చేసింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఆమె కి పెళ్ళై పాప ఉన్నా వన్నె తరగని అందంతో సినిమాల్లో గ్లామర్ షో చేస్తుంది ఐష్. ఐశ్వర్య రాయ్ 40 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలతో రొమాన్స్ చేయడం ఇప్పుడు బీ టౌన్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ మధ్యనే 'ఏ దిల్ హై ముష్కిల్' మూవీలో యంగ్ హీరో రణబీర్ కపూర్ తో చేసిన ఘాటు రొమాన్స్ మామూలు హాట్ టాపిక్ అవ్వలేదు?.
ఆ రొమాన్స్ ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందట. 'రంగ్ దే బసంతీ', 'భాగ్ మిల్కా భాగ్' లాంటి హిట్స్ ఇచ్చిన రాకేష్ ఓం ప్రకాష్ డైరెక్షన్ లో 'ఫ్యానీ ఖాన్' మూవీ తెరకెక్కనుంది. ఈ 'ఫ్యానీ ఖాన్' మూవీలో ఐశ్వర్య లీడ్ రోల్ చేయనుంది. 'ఫ్యానీ ఖాన్' లో ఐష్ కి జోడిగా వివేక్ ఓబెరాయ్ తమ్ముడు అక్షయ్ ఓబెరాయ్ ని హీరోగా తీసుకోవాలనుకున్నాడట డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్.
కాని ఐశ్వర్యకి ఒకప్పుడు వివేక్ ఓబెరాయ్ తో ఎఫైర్ ఉండడం.. దాని వల్ల సల్మాన్ ఖాన్ తో వివేక్ గొడవ పడడం వంటివి అందరికి తెలిసిందే. ఈ విషయమై ఐశ్వర్యతో నటించడానికి నో చెప్పేసాడట వివేక్ తమ్ముడు అక్షయ్ ఓబెరాయ్. ఇక అక్షయ్ ఈ సినిమాలో చెయ్యనని చెప్పేటప్పటికి ఐశ్వర్యకి జోడీగా మరో యంగ్ హీరో కోసం చూస్తున్నాడట డైరెక్టర్.

