నయన్ సెలెబ్రేషన్స్ సూపర్

నిన్న సోమవారం క్రిష్ట్మస్ పండుగను సామాన్య ప్రజలతోపాటు... సెలబ్రిటీస్ కూడా చాలా బాగా సెలెబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రతి ఏడు క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గానే చేసుకుంటారు. అలాగే టాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా చాలామంది స్టార్స్ ఈ క్రిష్టమస్ సెలబ్రేషన్స్ ని చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు క్రిష్ట్మస్ ట్రీని పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది తమ పిల్లల కోసం క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో మహేష్,అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య, సమంత ఇలా చాలామందే క్రిష్ట్మస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఇకపోతే కోలీవుడ్ లో కూడా టాప్ స్టార్స్ ఈ క్రిష్టమస్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అందులో నయనతార క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఎలా అంటే నయనతార, విగ్నేష్ శివం అనే యువ దర్శకుడితో రిలేషన్ ని మెయింటేన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఆ రిలేషన్ కి అర్ధాన్ని మాత్రం ఎప్పుడు బయటికి మాత్రం చెప్పదు. కానీ ఎప్పటికపుడు తానూ, విగ్నేష్ తో దిగిన పర్సనల్ ఫోటోస్ ని మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. మొన్నటికి మొన్న తన లవర్ విగ్నేష్ బర్త్ డే ని అమెరికాలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన నయన్ ఇప్పుడు ప్రియుడితో కలిసి క్రిష్ట్మస్ ని సెలెబ్రేట్ చేసుకుంది.
తన సొంత ఫ్లాట్ లో నయనతార..... విగ్నేష్ తో కలిసి దుబాయ్ నుండి తెప్పించిన స్పెషల్ క్రిష్టమస్ ట్రీ తో తో సెలెబ్రేట్ చేసుకుంది. క్రిస్మస్ సందర్బంగా విగ్నేష్ తో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది నయనతార . అయితే ఆ ఫోటోలను విగ్నేష్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. రిలేషన్ సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూనే మరోవైపు ఇలా కలిసి ఉంటూ పండుగలను సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే మాత్రం వారి మధ్యన ఏం లేదంటారా అంటున్నారు కొందరు.

