నయన్ లుక్ కొత్తగా వుంది

రవికుమార్ డైరెక్షన్ లో బాలకృష్ణ తన 102 వ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మాతగా స్టార్ట్ చేసాడు. ఈ నెల మొదట్లోనే షూటింగ్ ప్రారంభించేసుకోవడమే కాదు ఏకంగా సెట్స్ మీదికెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరిపేసుకుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో బాలకృష్ణ మీద హెవీ యాక్షన్ సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా నయనతార నటిస్తుంది. ఇప్పటివరకు రెండు సినిమాల్లో జోడి కట్టిన ఈ జంట ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుంది. అయితే నయనతార ఈ చిత్రంలో నటించేందుకు గాను నాలుగున్నర కోట్ల పారితోషకం అడగగా దానికి నిర్మాత సి కళ్యాణ్ సానుకూలంగా స్పందించబట్టే నయన్ ఈ సినిమా ఒప్పుకుందని టాక్ వుంది.
ఇకపోతే నయనతార ఈ సినిమా కోసం తన స్టైల్ పూర్తిగా మార్చినట్టు కనబడుతుంది. ఈ రోజు సోమవారం బాలకృష్ణ 102 వ చిత్ర షూటింగ్ లో భాగమవుతున్న తరుణంలో ఒక సెల్ఫీ పిక్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయనతార. అలాగే నయనతారతో కొత్త ప్రయాణం అంటూ స్టైలిస్ట్ నీరజ కోన, నయన్ తో దిగిన సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ లో నయన్ ఇప్పటివరకున్న స్టయిల్ ని పూర్తిగా మార్చేసినట్లే అనిపిస్తుంది. చీరకట్టు, పెద్ద బొట్టుతో సంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది నయనతార.
మరి బాలకృష్ణతో చేసిన 'సింహ, శ్రీరామరాజ్యం' సినిమాల్లో నటించినట్టే సాంప్రదాయ బద్దంగా ఈ సినిమాలో కూడా కనిపించబోతుందా అనే డౌట్ వస్తుంది. ఇకపోతే కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన నయనతార బికినీ షోలు కూడా చేసింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనక్కి తగ్గని భామగా నయనతార కి పేరుంది. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసిన లుక్ తోనే నయన్, బాలకృష్ణ మూవీలోకనబడుతుందో లేకపోతె ఇంకెలా దర్శనమిస్తుందో తెలియాలంటే సినిమా ఫస్ట్ లుక్ వరకు లేకుంటే సినిమా ట్రైలర్ బయటికి వచ్చేవరకో వెయిట్ చెయ్యాల్సిందే.


