నయన్ తరపున వకాల్తా పుచ్చుకుందా?

కోలీవుడ్ లో నయనతార స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీనిచ్చే రేంజ్ లో ఉంది. అంతేకాకూండా హీరోయిన్స్ అందరిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నయనతార టాప్ లోనే ఉంది. ఒక పక్క చిన్న పెద్ద హీరోల సరసన, మరోపక్క లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా నయనతార సత్తా చాటుతుంది. నయనతార నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాయి. అందుకే దర్శక నిర్మాతలు ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా వెనుకాడడం లేదు.
ఇకపోతే నయనతార రెమ్యునరేషన్ గురించి హీరోయిన్ రకుల్ ఏం చెబుతుంది అంటే... సౌత్ లో లేడి సూపర్ స్టార్ నయనతార అని.... ఆమె నటించిన సినిమాలన్నీ స్టార్ హీరోల సినిమాలతో సమానంగా కలెక్షన్స్ కొల్లగొడతాయని... స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న.. నయనతారకి కేవలం మూడు కోట్లు మాత్రమే నిర్మాతలు ముట్టజెబుతున్నారని... ఆమెతో సినిమాలు చేస్తే నిర్మాతలకు లాభాల పంట... అయినప్పటికీ ఆమెకి హీరోలకు ఇచ్చే పారితోషకంలో సగం కూడా ఇవ్వడం లేదని.. కేవలం హీరోలకిచ్చే దానిలో నాలుగో వంతు మాత్రమే ఇస్తున్నారని చెబుతుంది..
సినిమా ప్రపంచమే పురుషాధిక్య ప్రపంచమని... ఇక్కడ హీరోయిన్స్ కి పెద్దగా గౌరవ వేతనాలు ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తుంది రకుల్ ప్రీత్. మరి ఉన్నట్టుండి రకుల్ కి నయన్ ని పొగడాల్సిన పని ఏమిటో.. అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

