దేని కోసం ఆ టాటూ!!

అక్కినేని అఖిల్, సమంత లు కలిసి ఈ మధ్యన షాప్ ఓపెనింగ్స్ కి వెళుతున్నారు. గతంలో సౌతిండియా షాపింగ్ మాల్ ని వీరిద్దరూ వదిన మరిది హోదాలో రిబ్బన్ కట్ చేశారు. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల్, సమంతని వదినా అంటూ సంబోధిస్తున్నాడట. ఇక వీరిద్దరూ రీసెంట్ గా కరీంనగర్ లో ఒక షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమంత నిండైన చీర కట్టులో ఆకట్టుకోగా అఖిల్ కూడా మంచి డ్రెస్ తో ఆకట్టుకున్నాడు.
అయితే ఈ షాప్ కి రిబ్బన్ కట్ చేసేటప్పుడు అఖిల్ మోచేతి మీద వేయించుకున్న సరికొత్త టాటూ అందరి కంటా పడింది. ఒక బాణం గుర్తుతో పాటు 8 అంకెతో కూడిన ఆ టాటూ అఖిల్ చేతిమీద చూసిన వారందరికీ కాస్తంత ఆశ్చర్యం వేసింది. అయితే అఖిల్ ఈ టాటూ ని తన లేటెస్ట్ సినిమాకోసమే వేయించుకున్నాడా? అన్న డౌట్ కలుగుతుంది అంటున్నారు. ప్రస్తుతం అఖిల్ తన రెండో సినిమాని విక్రమ్ కుమార్ డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక డైరెక్టర్ విక్రమ్ కుమార్ విభిన్న చిత్రాలను తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఆయనకు అంకెలతో ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.. అందుకే ఆయన సినిమా టైటిల్స్ కూడా 13 బి,24 అంటూ కొత్తగా కనబడతాయి. మరి ఇప్పుడు అఖిల్ కూడా విక్రమ్ చెబితేనే ఆ టాటూ వేయించుకున్నాడో లేకపోతె కావాలనే తన మోచేతికి అలా బాణం గుర్తు టాటూ వేయించుకున్నాడో ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

