Thu Dec 25 2025 06:12:53 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళి మొత్తం ఫస్ట్లుక్ల హడావుడి మాత్రమే

మొత్తానికి ఈ దీపావళి పండగకి చిన్న పెద్ద చిత్రాలు తమ ఫస్ట్ లుక్ లతో సందడి చేశాయి. పెద్ద చిత్రాలైతే పండక్కి ఒక రోజు ముందే వచ్చేస్తే చిన్న చిత్రాలు కొన్ని పండగ రోజు తమ ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశాయి. పెద్ద హీరోల చిత్రాలు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చి మెగా ఫాన్స్ కి ఆనందాన్నిచ్చాడు. ఇక బాలయ్య ఈ దీపావళికి గౌతమీపుత్ర శాతకర్ణి రెండో లుక్ ని నందమూరి అలాగేమరో మెగా హీరో రామ్ చరణ్ కూడా తన ధ్రువ పోస్టర్స్, ఫొటోస్ తో మెగా ఫాన్స్ ముందు సందడి చేసాడు.
ఇంకా కొంతమంది హీరోలు కూడా తమ చిత్రాల ఫస్ట్ లుక్స్ తో ఈ దీపావళికి సందడి చేశారు. మంచు మనోజ్ అయితే రెండు చిత్రాల ఫస్ట్ లుక్స్ తో అలరించాడు. ఒకటి గుంటూరోడు ఫస్ట్ లుక్ కాగా రెండోది ఒక్కడు మిగిలాడు ఫస్ట్ లుక్ తో వచ్చాడు. ఇక నాని నేను లోకల్ అంటూ దీపావళికి రెండు రోజులు ముందే సందడి చేసాడు. రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త మొదట లుక్ తో వచ్చాడు. ఇక ద్వారకా, ఇంట్లోదేయ్యం నాకేం భయ్యం, అరకు రోడ్ లో, పిల్ల రాక్షసి, ఎంతవరకు ఈ ప్రేమ, ప్రేమమ్,నక్షత్రం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అందాల ప్రేయసి, మీలో ఎవరు కోటీశ్వరుడు, అప్పట్లో ఒకడుండేవాడు,త్రయం, నరుడా.. డొనరుడా అంటూ తమ తమ లుక్స్ తో ప్రేక్షకులకి దీపావళితో పాటు వారి సినిమాల లుక్స్ ని కానుకగా ఇచ్చారు.
Next Story

