దిల్ రాజుకి మొదలైన అజ్ఞ్యాతవాసి టెన్షన్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు లో దాదాపుగా అందరూ స్టార్ హీరోస్ తో చిత్రాలు నిర్మించారు కానీ నేటి వరకు తాను ఎంతగానో అభిమానించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే అవకాశం పొందలేకపోయారు. అయితే పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని నైజాం ప్రాంతంలో తానే పంపిణీ చేస్తూ ఆ లోటుని కొంతవరకు భర్తీ చేసుకుంటున్నారు. ఈ సారి కూడా సంక్రాంతి పండుగ సందర్భముగా ఈ నెల 10 వ తేదీన విడుదల కాబోతున్న అజ్ఞ్యాతవాసి చిత్ర నైజామ్ ప్రాంత పంపిణీ హక్కులు దిల్ రాజు చాలా కాలం క్రితమే సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు ఈ సినిమా వసూళ్ల గురించే రాజు గారికి టెన్షన్ మొదలయింది. ఇందుకు కారణం ఆయన వెచ్చించిన అధిక మొత్తమే. దాదాపు 29 కోట్ల రూపాయలకి అగ్న్యాతవాసి నైజామ్ విడుదల హక్కులని దక్కించుకున్నారు. కాగా పవర్ స్టార్ గత మూడు చిత్రాలు కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల విజయవంతంగా ప్రదర్శితం కాకపోవటంతో పెద్దగా రెవెన్యూస్ సాధించలేదు. పవన్ కళ్యాణ్ గత విజయవంతమైన చిత్రం అత్తారింటికి దారేది నైజామ్ ప్రాంతంలో 22 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేసింది. కాబట్టి అజ్ఞ్యాతవాసి అంతకు మించి భారీ విజయం సాధిస్తే తప్ప నైజామ్ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ మార్క్ కి చేరుకునే అవకాశం లేదు. అయితే పెయిడ్ ప్రీమియర్స్ కి అనుమతులు దాదాపుగా ఖరారు కావటంతో దిల్ రాజు తో పాటు ఎక్సిభిటర్స్ కూడా తొలి రెండు రోజుల గ్రాండ్ ఓపెనింగ్స్ పైనే ఆశలు పెట్టుకున్నారు

