దాసరి వారసుడు విలన్ గా రీఎంట్రీ!

దాసరి నారాయణ రావు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మహోన్నత వ్యక్తిగా పేరు గాంచారు. ఆయన సినిమా పరిశ్రమకు ఎంత మేలు చేశారో మాటలతో వర్ణించలేనిది. అసలు అయన తెలుగు సినిమా పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు లాంటి వారు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాపరిశ్రమకుకి ఆయన ఒక దైర్యం అని చెప్పొచ్చు. అసలు చిన్న చిన్న సినిమా నిర్మాతలైతే అయితే దాసరిని ఒక దైవం లాగ కొలుస్తారు. అలాంటి దాసరి కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల కన్ను మూసిన విషయం తెలిసిందే. దాసరి మరణంతో తెలుగు సినీపరిశ్రమ మూగబోయింది. మళ్ళీ దాసరి స్థానాన్ని భర్తీ చేసే నాధుడే లేకుండా పోయాడు. ఇప్పుడున్న ఏ ఒక్కరు కూడా దాసరికి సాటి రాలేరు. మళ్ళీ దాసరిలా తెలుగు సినిమాకి పెద్ద దిక్కు ఎవరవుతారు అనేది తేల్చలేని చిక్కుముడి ప్రశ్న.
ఇకపోతే దాసరి లా ఆయన సంతానంలో ఒక్కరు కూడా లేరు. దాసరి నటన, దర్శకుడిగా, నిర్మాతగా ఒకటేమిటి అన్ని కళల్లో నైపుణ్యం చూపించేసి ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. కానీ ఆయన పుత్ర రత్నాలు మాత్రం అయన సంపదకు వారసులు అయ్యారు గాని... ఆయన ఆశయానికి వారసులుకాలేకపోయారు. అయితే దాసరి చిన్న కొడుకు అరుణ్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించి పెద్దగా విజయం సాధించలేక ఇబ్బందులు పడ్డాడు. అయితే ఇప్పుడు మాత్రం అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మళ్ళీ తాను సినిమాల్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను అని ఆయన మనసులోని మాటని బయట పెట్టారు.
అసలు తెలుగు సినిమాల్లో హీరో గా సక్సెస్ కాని అరుణ్, విలన్ పాత్రలు అయినా చేయడానికి వేనుకాడను అని చెప్పాడు. అయితే అరుణ్ అన్న మాటలకూ కనెక్ట్ అవుతూ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఒక న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాసరి అరుణ్, మెగా హీరో అల్లు శిరీష్ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్న వాడ’ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా దాసరి అరుణ్ ని డైరెక్టర్ వి ఐ ఆనంద్ సెలెక్ట్ చేశాడనే న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.