దానితో పాటే ఇదీనూ

మెగా స్టార్ 151 వ చిత్రం సైలెంట్ గా మొదలైనా కూడా ఆగష్టు 22 న కావాల్సిన క్లారిటీ ఇస్తామని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుండి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఏదో మంచి రోజు కాబట్టి సైలెంగ్ సినిమా ఓపెనింగ్ చేసాము గాని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా చెయ్యాల్సిన అవసరమా లేదు అంటున్నారు మెగా ఫ్యామిలీ మెంబెర్స్. ఎలాగూ చిరంజీవి బర్త్ డే ఈ నెల 22 నే కాబట్టి అదే రోజు చిరంజీవి 151 వ సినిమా టైటిల్ లాంచ్ తోపాటు మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు. చిరంజీవి పుట్టిన రోజు రోజున ఎప్పుడెప్పుడు 151 వ టైటిల్ మరియు మోషన్ పోస్టర్ చూస్తామా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాడు.
ఇక టైటిల్, మోషన్ పోస్టర్ తోపాటు సినిమాలో నటించే నటీనటుల వివరాలు కూడా వెల్లడించే ఏర్పాట్లు చేస్తున్నారట. మరి నటీనటుల వివారాలు ఆ రోజే రివీల్ చేసినా... ఇప్పుడు మాత్రం అందులో నటించే నటుల వివరాలు బయటికొచ్చాయంటున్నారు. చిరు 151 వ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఒక గెస్ట్ రోల్ చేస్తాడని... అలాగే కన్నడ నటుడు సుదీప్ కూడా ఈ చిత్రంలో నటించబోతుండటం కూడా వాస్తవమే అని సమాచారం అందుతుంది. ఇక హీరోయిన్ గా చిరు 151 కోసం నయనతార ని ఫైనల్ చేసినట్లు కూడా చెబుతున్నారు. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మాన్ తో చర్చిలు జరిపినట్టు ఇంకా ఆ విషయం ఒక కొలిక్కి రానట్టుగా ప్రచారం జరుగుతుంది.
అలాగే చిరు చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా.... రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక ఉయ్యాలవాడ జీవిత కథని ఆదారంగా ఈ చిత్ర కథని తయారు చెయ్యడానికి పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్.. వేమారెడ్డి.. మరో ఇద్దరు రచయితలు కలిసి కష్టపడి... స్క్రిప్ట్ ని తయారు చేస్తున్నారు.

