Sat Dec 27 2025 03:45:57 GMT+0000 (Coordinated Universal Time)
దసరా హవా నడిపిస్తున్నది చైతూ ఒక్కడే

విజయ దశమి సందర్భముగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావటం వాటి ఫలితాలు తేలిపోవటం జరిగిపోయి తదుపరి శుక్రవారం కూడా మూడు చిత్రాలు ప్రేక్షకులని పలకరించాయి. కానీ విజయ దశమికి విడుదల ఐన ప్రేమమ్ చిత్రమే వసూళ్ల పరంగా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. అనువాద చిత్రాలుగా వచ్చిన అభినేత్రి విడుదల ఐన మొదటి వారాంతం కొంత మేర వసూళ్లు రాబట్టినా, తరువాత ఒకేసారి ఊహించని స్థాయిలో పోటీ నుంచి తప్పుకుంది. ఇక మన ఊరి రామాయణం మొదటి నుంచి ఒక వర్గ ప్రేక్షకులకే పరిమితం కావటంతో ప్రేమమ్ చిత్రంతో పాటే విడుదల ఐనా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మన ఊరి రామాయణం విజయ దశమి చిత్రాలతో కాక విడిగా వచ్చిఉంటే కొంత మేర ప్రేక్షకాదరణ దక్కేదని అభిప్రాయం పడుతున్నారు సినీ పండితులు.
ఈడు గోల్డ్ ఎహె వంటి కమర్షియల్ ఎంటెర్టైనెర్తో వచ్చిన సునీల్ కథ కథనాలు మరీ మూస ధోరణిలో వున్నవి ఎంచుకుని మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు పూర్తిగా దూరమై, బి, సి సెంటర్లలో మాత్రం తొలి మూడు రోజులు సందడి చేసాడు. తరువాత వెనుకంజలోకి జారిపోయాడు. తాజా గా విడుదల ఐన నాగ భరణం గ్రాఫిక్స్ తప్ప కథ కథనాలు ఆకట్టుకునే రీతిలో లేకపోయేసరికి ప్రేమమ్ హడావిడి ఏ మాత్రం తగ్గలేదు మల్టీప్లెక్స్ లలో. బి, సి సెంటర్లలో పూర్తి స్థాయి విజయం నమోదు చెయ్యటానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
ఎటు మరే చిత్రం వసూళ్లు రాబట్టలేకపోవటంతో ప్రేమమ్ ఈ వారానికి సేఫ్. కానీ ఈ శుక్రవారం రానున్న ఇజం సి సెంటర్లలో అధిక ప్రభావం చూపే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ లోపే పంపిణీదారులను లాభాల బాట పట్టించే అవకాశాలు ప్రేమమ్ కు లేకపోలేదు.
Next Story

