దర్శకధీరుడు మెచ్చిన చిత్రం

వరుణ్ తేజ్ , రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ గత వారమే విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. వరుణ్ తేజ్ నటన, రాశి ఖన్నా నటన, లోకేషన్లు, సినిమాటోగ్రఫీ, కథనం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.
ఇకపోతే ఈ చిత్రం పై సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తొలిప్రేమ మనసుకు హత్తుకునేలాఉండని తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందంచడం కూడా తొలిప్రేమ యూనిట్ కి బూస్ట్ నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా చేరిపోయాడు. ఈ చిత్రాన్ని చూసిన రాజమౌళి ట్విట్టర్ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ...
నేను ప్రేమ కథలకు అభిమానిని కాదు.. కానీ ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ ను ఎంజాయ్ చేశాను. తొలి ప్రయత్నంలోనే వెంకీ బాగా హ్యాండిల్ చేశాడు. తన బలాన్ని వరుణ్ తేజ్ పెంచుకుంటున్నాడు. రాశి చాలా బాగుంది.. ఆమె నటన ఇంకా బాగుంది అంటూ ట్వీట్ వెయ్యడంతో తొలిప్రేమ చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయింది.