త్రివిక్రమ్ సినిమా తర్వాత కూడా తారక్ అదే జోనర్ సినిమా

'జై లవకుశ' మూవీ తర్వాత తారక్ తన ఫ్యామిలీ తో హాలిడేకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ హాలిడే తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ సినిమా కోసం బాడీ పై కూడా కొంతమేర ఛేంజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయట. 'జై లవ కుశ' లో కొంచెం లావుగా కనబడిన ఎన్టీఆర్... త్రివిక్రమ్ సినిమా కోసం కాస్త బరువు తగ్గించుకునే పనిలో పడ్డాడని టాక్ ఉంది.
ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ సినిమా తర్వాత వెంటనే దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నటించనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకి కూడా తారక్ బాడీ పై ఫోకస్ చేసాడట. సతీష్ వేగేశ్న తీసే సినిమాకి 'శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు దిల్ రాజు. త్రివిక్రమ్ తో చేసే సినిమా ఫామిలీ సినిమా కాగా సతీష్ వేగేశ్న తీసే సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని.... ఆ టైటిల్ చూస్తుంటేనే అర్ధమవుతుంది.
అయితే ఎన్టీఆర్ రెండు ఒకే జోనర్ లో అంటే.. ఫ్యామిలీ సినిమాలు చేసి.. ఈ జోనర్ లో తన పట్టు పెంచుకోవాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టుపై అందరూ ఓకే చెప్పేసుకుని ఎన్టీఆర్ తగినట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు ప్రారంభించే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. అలాగే ఈ సినిమాని దిల్ రాజు త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

