త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదేనా?

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం కోసం అంత రెడీ అయింది. వచ్చేవారంలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ శ్రీదేవి అకాల మరణం దృష్ట్యా షూటింగ్ రెండు వారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి రెడీగా వున్నాడు త్రివిక్రమ్.
ఎన్టీఆర్ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బృందావనం తరహాలో ఫుల్ ఫామిలీ ఎంటెర్టైనెర్ అని వార్తలు రాగా ఇప్పుడు మరొక తాజా సమాచారం ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. ఇందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని లేటెస్ట్ బజ్.
అందుకోసమే ఎన్టీఆర్ ఓ స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకుని బాడీ షేప్ అవుట్ కోసం బాగా కష్ట పడుతున్నాడట. వీటికి సంబంధించి ఆ మధ్య కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఆ లుక్ బయటికి రాకూడదనే బిగ్ బాస్ సీజన్ 2 కూడా వదులుకున్నట్టు వినికిడి. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఒక సీనియర్ హీరొయిన్ తో ప్రాధాన్యం ఉన్న రోల్ చేయించే అలవాటు వుంది. ఈ సినిమా కోసం మీనా..లయ..సిమ్రాన్ లలో ఒక్కరిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

