తొలిప్రేమను చేజార్చుకున్న హీరోయిన్?

గత ఏడాది మెహరీన్ కౌర్ క్రేజ్ టాలీవుడ్ లో మాములుగా లేదు. వరుస హిట్స్ తో అమ్మడుకి తిరుగులేదనుకున్నారు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ నుండి రాజా ది గ్రేట్ వరకు మెహరీన్ కి మ్యాగ్జిమమ్ అన్ని హిట్స్ అందులో ఒక్క జవాన్ తప్ప. గత ఏడాది అయితే మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల హిట్స్ మెహరీన్ కి అనేక అవకాశాలు కల్పించి బిజీ హీరోయిన్ ని చేస్తాయనుకున్నారు అంతా. కానీ మెహరీన్ బ్యాడ్ లక్ కాదుగాని.... ఆమె సరైన డైట్ చెయ్యకపోవడం వలన విపరీతంగా బరువు పెరడంతో.. గ్లామర్ రోల్స్ లో మెహ్రీన్ బాగా లావుగా కనబడం వలెనే ఆమెకు స్టార్స్ పక్కన అవకాశాలు తగ్గిపోయాయి.
ముందుగా మెహరీన్ ను అనుకుని....
అయితే అందులో ఒక మంచి సూపర్ హిట్ ఆఫర్ ని మెహరీన్ చేజార్చుకుందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేనండి వరుణ్ తేజ్ - రాశి ఖన్నా లు జంటగా తెరకెక్కిన తొలిప్రేమలో ముందుగా ఆ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి మెహ్రీన్ కౌర్ నే అనుకున్నాడట. కేవలం అనుకోవడం మాత్రమేకాదు మెహరీన్ ని దర్శక నిర్మాతలు సంప్రదించారట కూడా. కానీ తర్వాత మెహరీన్ బరువు తో లావుగా కనబడం.... ఆ టైం లో మరో బొద్దుగుమ్మ రాశి ఖన్నా బాగా వెయిట్ తగ్గి సన్నగా నాజూగ్గా తయారవడంతో.... తొలిప్రేమ ఆఫర్ రాశి ఖన్నాకి వెళ్లిపోయిందట. మరి కేవలం లావుగా ఉండడం వలెనే తొలిప్రేమ సినిమా ఛాన్స్ మెహరీన్ నుంచి రాశి ఖన్నాకు వెళ్లింది.
బరువు పెరిగినందునేనా?
మరి రాజా ధీ గ్రేట్ సినిమా విడుదల సమయంలోనే మెహరీన్ బరువు ఆమెకు చేటు చేస్తుందని చాలామంది అభిప్రాయం పడ్డారు. మరి ఆ విషయం మెహరీన్ వరకు వెళ్ళలేదంటారా... లేదంటే వినినా విననట్టుగా మెహరీన్ ఉండిపోయిందో తెలియదు గాని... ఒక సూపర్ హిట్ ఛాన్స్ మాత్రం మెహరీన్ కేవలం తన బరువు కారణంగా చేజార్చుకోవడం మాత్రం బాధాకరమే. మరి ప్రస్తుతం గోపీచంద్ వంటి ఫామ్ లో లేనినటుడితో పంతం సినిమా తప్ప అమ్మడుకు చేతిలో మరే సినిమా లేదు.
- Tags
- మెహరీన్ కౌర్

