తరగని అందంతో మెరిసిపోతున్న పిగ్గీ చాప్స్

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కాల్షీట్స్ కోసం ఎదురు చూడని బాలీవుడ్ ప్రొడ్యూసర్ వుండరు. సినిమా పరిశ్రమకి వచ్చి రెండు దశాబ్దాల కాలం పూర్తి కావస్తున్నా ఒక కథానాయిక ఇంత క్రేజ్ ని నిలుపుకుంటూ కెరీర్ సాగించటం సామాన్యమైన విషయం కాదు. అయితే బాలీవుడ్ నిర్మాతలకి అందుబాటులో ఉండక, పూర్తిగా హాలీవుడ్ సినిమాలు, టెలి సిరీస్ లతో బిజీ అయిపోయింది ప్రియాంక చోప్రా. క్వాన్టికో టెలి సిరీస్ ప్రియాంక చోప్రా ని హాలీవుడ్ లో కూడా తిరుగు లేని స్టార్ ని చేసేసింది. దానితో హాలీవుడ్ లో వరుస అవకాశాలు పిగ్గీ చాప్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఇలా హాలీవుడ్ కే పరిమితమైతే తనని స్టార్ ని చేసిన ఇండియన్ అభిమానులకి తాను దూరం అవుతాననే భయం కలిగిన ప్రియాంక అడపా దడపా తన ఫోటో షూట్స్ లతో అభిమానులని ఆకర్షిస్తూనే వుంది. ఒక దశాబ్ద కాలంగా డబ్బూ రత్నాన్ని కేలండర్ కి ఫోజులిస్తూ వస్తున్న ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ లో బిజీ అయిపోయినప్పటికీ డబ్బూ రత్నాన్ని కేలండర్ ఫోటో షూట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో తీసిన ఒక ఫొటోలో బ్లాక్ జాకెట్ ధరించి తన కాళ్ళ సోయగాలని ప్రదర్శిస్తూ అభిమానులని తన అందాలతో కట్టిపడేస్తుంది ప్రియాంక చోప్రా. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో, తీరిక లేని ఆఫర్స్ తో దూసుకుపోతున్న పిగ్గీ చాప్స్ ని చూసి అభిమానులు ఆనందాశ్చర్యాలకి గురవుతూ సోషల్ మీడియాలో డబ్బూ రత్నాన్ని ఫోటో షూట్ లోని పిగ్గీ చాప్స్ ఫొటోలకి ఆశించని క్రేజ్ తీసుకొచ్చేశారు.


