తమ్ము తర్వాతే ప్రభాస్

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘ప్రభాస్’ . ఇప్పుడు తాజాగా అతడికి మరో గౌరవం దక్కింది.
ప్రపంచ ప్రఖ్యాత సినిమాల వెబ్సైట్ ఐఎండిబి ప్రకటించిన టాప్ 10 స్టార్స్ అఫ్ ఇండియన్ సినిమా 2017 జాబితాలో ప్రభాస్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు.
బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్ , అమిర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ లతో పోటీ పడిన ప్రభాస్ ఆరో స్థానంలో నిలవడం విశేషమే.. దక్షణాది కథానాయకుల్లో ప్రభాస్ మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించాడు. బాహుబలితో బాలీవుడ్ లో కూడా క్రేజ్ ను సంపాదించుకున్న తమ్మన్నా , అనుష్క లు సైతం ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. అమిర్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు.. సల్మాన్ మూడు స్థానంలో నిలవగా… తమ్మన్నా నాలుగో స్థానం.. అనుష్క శెట్టి 8వ స్థానం.. హృతిక్ రోషన్ 9వ స్థానంలో నిలిచారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే... బాహుబలితో ఫెడవుట్ అయిన హీరోయిన్ తమన్నా ఈ జాబితాలో ప్రభాస్ ని వెనక్కి నెట్టి నాలుగోస్థానం సంపాదించడం.

