తమిళ అర్జున్ రెడ్డి ఎలా ఉన్నాడో తెలుసా?

విజయ్ దేవరకొండకి గత ఏడాది అర్జున్ రెడ్డితో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో పూర్తిగా అర్జున్ రెడ్డి స్టయిల్లోకి మారిపోయిన విజయ్ దేవరకొండ చేతికి క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా బంపర్ హిట్ అవడంతో ఆ సినిమాని పలు భాషల్లో రీమేక్ చెయ్యాలని ఆయా భాషల నిర్మాతలు పోటీ పడ్డారు. అలాగే తమిళ హిందీ అర్జున్ రెడ్డి హక్కులను తీసుకున్న వారిలో హిందీ నిర్మాతలు అర్జున్ రెడ్డి కి హీరో దొరక్క సినిమాని ఇంకా సెట్స్ మీదకి ఎక్కించలేదు. కానీ తమిళంలో మాత్రం విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.
మరి ధృవ్ తమిళ అర్జున్ రెడ్డితోనే వెండితెర అరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ లా తిరిగిన ధృవ్ ఒక్కసారిగా అర్జున్ రెడ్డి లుక్ లోకి మారితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా... మరి పూర్తిగా గెడ్డం పెంచేసి, చాలా రఫ్ అర్జున్ రెడ్డి లుక్ లోకి మారిపోయిన ధృవ్ ని మీరు ఓ లుక్కేయండి. అర్జున్ రెడ్డి పాత్ర కోసం ధృవ్ చాలా డేడికేటెడ్ గా మేకోవర్ అయ్యాడు. మరి తండ్రి విక్రమ్ కూడా తన సినిమాల్లో ఏ లుక్ లోకైనా ఈజీగా మారిపోతాడు. ఇప్పుడు ధృవ్ ని అర్జున్ రెడ్డి లుక్ లో చూస్తుంటే తండ్రికి తగ్గ తనయుడిలా కనబడుతున్నాడు.

తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో తెరకెక్కుతూన్న ఈ చిత్రాన్ని తమిళనాట బడా ప్రొడ్యూసర్ తెరకెక్కిస్తున్నాడు. మరి ధృవ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యే ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం.

