తదుపరి చిత్రంపైనే ఆశలన్నీ

నేను శైలజ, నేను లోకల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువైన కీర్తి సురేష్ తెలుగు లో తన మూడవ చిత్రమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కథానాయిక గా నటించే అవకాశం కావటం పైగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అవ్వటంతో సంబరపడిపోయిన కీర్తికి తీవ్ర నిరాశనే మిగిల్చింది 2018 సంక్రాంతి పండుగ. అజ్ఞ్యాతవాసి డిసాస్టర్ కావటంతో పాటు తమిళంలో హిట్ ఐన సూర్య సినిమా అదే రోజు న తెలుగు లో గ్యాంగ్ పేరుతో విడుదలై మోస్తరు టాక్ తెచుకున్నప్పటికీ మార్కెట్ కోల్పోయిన హీరో కావటంతో కలెక్షన్స్ పెద్దగా పుంజుకోవటం లేదు. కాగా గ్యాంగ్ చిత్రంలో కూడా హీరోయిన్ కీర్తి సురేష్ కావటంతో సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకులని అలరించలేక రెండు చిత్రాలతో చతికిల పడింది కీర్తి.
సంక్రాంతి పండుగ నిరాశ పరిచినప్పటికీ కీర్తి సురేష్ తనని తాను నిరూపించుకునే మహత్తరమైన అవకాశం వైజయంతి వారి 'మహానటి' రూపంలో ఉండటంతో చాలా ధీమాగా వుంది కీర్తి. ఇప్పటికే చిత్రీకరణ సింహ భాగం పూర్తయిన ఈ చిత్రంలో కీర్తి మహానటి సావిత్రి గారి పాత్ర పోషిస్తుండటంతో ప్రేక్షకుల హృదయాలకి చేరువ అయ్యే సదావకాశం గా భావిస్తూ ఆ పాత్రకి తన బెస్ట్ ఇవ్వటానికి అహర్నిశలు శ్రమిస్తోంది కీర్తి. మార్చ్ నెలలో విడుదలకి సిద్దమవుతున్న మహానటి పైనే ఇక కీర్తి ఆశలన్నీ.

