డీజే దెబ్బకి సెటిల్?

అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో హాట్ హాట్ గా రెచ్చిపోయిన పూజ హెగ్డే కి సుడి తిరిగినట్లేనా? అంటే అవుననే అంటున్నారు. అల్లు అర్జున్ సరసన అదిరిపోయే స్టెప్పులు వేసి, అలాగే నాభి అందాలతోపాటే... స్విమ్మింగ్ ఫూల్ దగ్గర తడి తడి అందాలతో రెచ్చిపోయి గ్లామర్ షో చేసిన పూజని డీజే సినిమా హిట్ తో కోటి రూపాయలకు బెల్లంకొండ శ్రీనివాస కోసం బెల్లంకొండ సురేష్ పూజ ని సాక్ష్యంలో నటింపజేస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో రొమాన్స్ చేస్తున్న పూజ హెగ్డే మరోపక్క వంశి పైడిపల్లి - మహేష్ బాబు సినిమా లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. మహేష్ 25 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హాట్ అందాలు ప్రధాన ఆకర్షణ అంటున్నారు. దీనితోనే పూజ హెగ్డే సుడి తిరిగింది అనుకుంటే... ప్రస్తుతం పూజ కి మరో రెండు స్టార్ హీరోల సినిమాలు కూడా తలుపు తట్టేలా కనబడుతున్నాయి.
అందులో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాలో పూజ హెగ్డే పేరుని ఫైనల్ చేసే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ముందుగా ఎన్టీఆర్ సరసన అను ఇమ్మాన్యువల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ తో అను ని తప్పించి ఆ ప్లేస్ లోకి పూజ హెగ్డే ని అనుకున్నారు. అధికారికంగా ప్రకటన రాలేదుగాని... దాదాపుగా ఎన్టీఆర్ పక్కన స్టెప్పులు వేసి రొమాంటిక్ గా రెచ్చిపోయేది మాత్రం పూజానే అంటున్నారు. అలాగే పూజ కి మరో బిగ్ ఆఫర్ కూడా తగిలింది అంటున్నారు.
ఈ ఆఫర్ అయితే అలాంటి ఇలాంటి ఆఫర్ కాదండోయ్.... ఏకంగా బాహుబలి ప్రభాస్ పక్కన పూజ హెగ్డే అవకాశం కొట్టేసిందని అంటున్నారు. ప్రస్తుతం సాహో సినిమా లో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ తో నటిస్తున్న ప్రభాస్ ఆతర్వాత రాధాకృష్ణ దర్శత్వంలో నటించబోయే సినిమా లో పూజ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటాడనే టాక్ వినబడుతుంది. మరి ఇలా వరుసగా ముగ్గురు బడా స్టార్స్ తో పూజ హెగ్డే పేరు వినిపిస్తుంది అంటే... ఆమె సుడి ఎలా ఉందొ అర్ధమవుతుంది. పాపకి డీజే లో చేసిన గ్లామర్ షో మాత్రం బాగా పనికొచ్చిందనేది ఈ అవకాశాలను చూస్తుంటేనే తెలుస్తుంది.