Sun Dec 28 2025 07:36:53 GMT+0000 (Coordinated Universal Time)
డిసెంబర్లో విడుదలయ్యే చిత్రానికి ఇప్పుడే రివ్యూ

- మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ భారీ విజయం పీకే తర్వాత నటిస్తున్న చిత్రం దంగల్. పీకే చిత్ర విడుదల తర్వాత సుధీర కాలం తన శరీర ఆకృతిని దంగల్ చిత్రంలో తాను పోషించే రెండు పాత్రలకు అనుగుణంగా మలచుకొనేందుకే శ్రమించాడు ఆమిర్ ఖాన్. ముందు నుంచి ప్రకటించినట్లు గానే దంగల్ చిత్రాన్ని డిసెంబర్ విడుదలకి సన్నద్ధం చేసారు. చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాల తర్వాత ప్రచారానికి అధిక సమయం కేటాయించటం బాలీవుడ్ నిర్మాతల సాంప్రదాయం. అందుకే ఇప్పటికే ఫస్ట్ కాపీ సిద్ధం అయిపోయిన దంగల్ చిత్రాన్ని ఇంకా రెండు నెలల తర్వాత విడుదల చెయ్యనున్నారు.
ఫస్ట్ కాపీ సిద్ధం ఐన వెంటనే ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దంగల్ చిత్రాన్ని వీక్షించారు. చిత్ర ప్రదర్శన అనంతరం తన అనుభూతిని పంచుకుంటూ "ఎప్పటిలానే ఆమిర్ ఖాన్ అద్భుత నటనకు పేరు పెట్టలేని విధంగా ఆయన నటన ఉంది. అద్భుతమైన కథని అంతే అద్భుతంగా తెరకెక్కించిన తీరు అయితే ప్రతి ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది. ఈ దశాబ్దానికే దంగల్ మేటి చిత్రంగా నిలిచిపోనుంది. పీకే వసూళ్ల చరిత్రని మళ్లీ ఆమిర్ ఖాన్ దంగల్ తో తిరగ రాయటం ఖాయం." అని చెప్పారు.
ఈ నెల 28 న కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన హే దిల్ హై ముష్కిల్ చిత్రం విడుదల ఉన్నా, తన సొంత చిత్రం ప్రచారం పక్కనపెట్టి, దంగల్ చిత్రాన్ని ఇంతలా ప్రచారం చేస్తున్నాడంటే ఈ చిత్రం కరణ్ పై ఎంతటి ప్రభావం చూపిందో ఊహించుకోవచ్చు
Next Story

