డబ్బింగ్ సినిమాలు వెంటపడుతున్న పవన్ నిర్మాత!!

'సర్దార్ గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' సినిమాలు ప్లాప్ అవడంతో నిర్మాత శరత్ మరార్ డబ్బింగ్ సినిమాల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా తమిళ్ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' సినిమాను మన తెలుగులో 'అదిరింది' అనే పేరుతో డబ్ చేసాడు. అయితే మరో తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తునట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఆరమ్ ను కూడా....
లేటెస్ట్ గా నయనతార కీలకపాత్రలో నటించిన హీరోయిన్ ఓరింయెంటెడ్ సినిమా 'ఆరమ్' సినిమాను తెలుగులో శరత్ మరార్ డబ్ చేసి అందించబోతున్నాడు. ఈ సినిమా తమిళం లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గోపీ నయనార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కలెక్టర్ గా నటించింది.
మాస్ సినిమా కాదు...
అయితే మరి ఈ సినిమాను శరత్ మరార్ ఏ విధంగా తెలుగులో డబ్ చేయాలనుకుంటున్నాడో తెలియట్లేదు. ఎందుకంటే ఈ సినిమా బీసి సెంటర్స్ లో ఆడకపోవొచ్చు. బీసి సెంటర్స్ ని ఆకట్టుకునే మాస్ సినిమా కాదు. అలా అని ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కూడా కాదు. ఇది ఏ సెంటర్లు, మల్టీ ఫ్లెక్స్ లను ఆకట్టుకునే సినిమా. మరి ఎందుకని ఇంత సాహసం చేస్తున్నాడని తెలియాల్సివుంది. తమిళ నిర్మాతల స్నేహం వల్లే శరత్ మరార్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని వినికిడి.
- Tags
- శరత్ మరార్

