టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కౌంట్ పెరిగింది

గత రెండు దశాబ్దాలు నుండి టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలని చూసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఒక్కప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. చాలా మంది తెలుగు అమ్మాయిలే హీరోయిన్స్ గా రాణించారు. స్టార్ స్టేటస్ ని కూడా ఎంజాయ్ చేసారు.
కానీ రెండు దశాబ్దాలు నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు అమ్మాయిలు కనిపించడం మానేశారు. ఒక్క పేరు కూడా వినిపించడం లేదు. ఉన్న చిన్న సినిమాల్లో నటిస్తున్నారు లేదా పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలకో పరిమితం అవుతున్నారు.
అయితే గత కొంత కాలం నుండి తెలుగు అమ్మాయిల కౌంట్ కాసింత పెరుగుతోంది. రీతు వర్మ.. అనీషా ఆంబ్రోస్.. ఈషా రెబ్బా.. నీహారిక కొణిదెల...అపూర్వ శ్రీనివాసన్.. పునర్నవి భూపాలం.. ప్రియాంక జవాల్కర్..శివాని రాజశేఖర్...శోభిత ధూళిపాళ ఇలా చాలా మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో తమ సత్తా చూపించటానికి రెడీ అవుతున్నారు. అయితే వీరు ప్రస్తుతం చిన్న సినిమాలకే పరిమితం అయ్యారు. ఇంక కావాల్సినదల్లా వారికి పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం మాత్రమే. చిన్న సినిమాల నుండి టాప్ సినిమాలు చేసే స్థాయికి ఎదుగుతారని ఆశిద్దాం.

