టాప్ 10 లో పొడుగుకాళ్ల సుందరి!
![టాప్ 10 లో పొడుగుకాళ్ల సుందరి! టాప్ 10 లో పొడుగుకాళ్ల సుందరి!](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/08/deepika-padukone-launches-her-own-designer-label_d13ba18c-8062-11e5-ba56-8cfa9414553d.jpg)
'బాజీరావ్ మస్తానీ, పీకూ' సినిమాల హిట్స్ తో బాలీవుడ్ నేఁ 1 నటి గా దీపికా పదుకొనే పేరుతెచ్చుకుంది. తనకంటూ బాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి దీపికా . ఈమె రవీర్ సింగ్ తో ప్రేమలో ఉండి త్వరలో పెళ్లిపీటలెక్కుతారని అనుకుంటున్నారు. అయితే దీపికా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్నది. అయితే తాజాగా పోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల జాబితాలో ఈ పొడుగు కాళ్ల సుందరి పదో స్థానం దక్కించుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి బాలీవుడ్ నటి కూడా దీపికే కావడం విశేషం. 'బాజీరావ్ మస్తానీ, పీకూ' సినిమాలతో దీపిక జాక్‌పాట్ కొట్టినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. హాలీవుడ్లో తోటి నటీనటుల కంటే తక్కువ పారితోషికం తీసుకున్నా.. బ్రాండ్స్ ఎండార్స్మెంట్లతో భారీ ఆదాయం అందుకొంటూ దీపిక ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించింది. బెంగళూరుకు చెందిన దీపిక 2007లో షారుఖ్ సరసన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో తెరంగేట్రం చేసింది. వరుస ఆఫర్లతో బాలీవుడ్లో అగ్రనటిగా కొనసాగుతూనే హాలీవుడ్‌కి అడుగుపెట్టింది. అదీకాకుండా సొంతంగా ఆన్లైన్ షాపింగ్ సైట్ ప్రారంభించి స్టైల్ ఐకాన్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇక దీపికా ఇంతటి ఘనత సాధించడానికి తన స్వశక్తే కారణమని చెబుతుంది.
ఫోర్బ్స్ టాప్ టెన్‌లో ఉన్న మిగతా తొమ్మిది మంది హాలీవుడ్ నటులు జెన్నిఫర్ లారెన్స్, మెలిస్సా మెక్కార్తి, స్కార్లెట్ జొహాన్సన్, జెన్నిఫర్ ఆనిస్టన్, ఫాన్ బింగ్‌బింగ్, చార్లీజ్ థెరోన్, అమీ ఆడమ్స్, మిలా కునిస్ లు వున్నారు