జాన్వీ సింపుల్ గా వచ్చేసింది

అతిలోక సుందరిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటి శ్రీదేవి. ఆమెకు ఇప్పటికీ అభిమానులున్నారు. చాన్నాళ్ల తరువాత తిరిగి వెండితెర పై ఆమె మెరిసింది. ప్రస్తుతం ఆమె అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ఉంది. తాజాగా ఆమె వారసురాలిగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది ఆమె కూతరు జాహ్నవి కపూర్.
జాహ్నవి కపూర్ ను వెండితెరకు పరిచయం చేయాలని చూస్తున్న శ్రీదేవి ఆ బాధ్యతల్ని బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కు అప్పగించింది. అతడి ఆధ్వర్యంలో ఆమె మరాఠీ చిత్రం ‘సైరత్’ రీమేక్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి ‘దఢక్’ అనే పేరును కూడా పెట్టేసారు. ఇషాన్ ఖట్టర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మరాఠీలో విజయవంతమైన ‘సైరత్’ చిత్ర కథను హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు అంటే ఏ శుక్రవారం ఉదయం జరిగాయి. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఆ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం జులై 6న విడుదల కానుంది.

