Mon Dec 29 2025 02:25:53 GMT+0000 (Coordinated Universal Time)
జాగ్రత్తగా ఉండాల్సిందే అని హెచ్చరిస్తున్నచంద్రబాబు

ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకడం ఎక్కువైంది. ఈ మధ్యన తరుచూ మంత్రులతో సమావేశమై వారి పనితీరు ఇంకా మెరుగు పరుచుకోవాలని ప్రజలికి వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చెయ్యాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రుల తీరుతో తానూ అస్సలు సంతోషం లేనని బహిరంగం గా వారికి చెప్పేశాడు. ఇక బాబు తన అసంతృప్తిని నేరుగా వారిదగ్గర ప్రస్తావించాడు. అసలు మంత్రుల పనితీరు వల్లే కాకుండా తన కొడుకు లోకేష్ పనితీరు వల్ల కూడా సంతృప్తిగా లేనని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.
అసలు ప్రజలను, పార్టీని నిర్లక్ష్యం చేస్తే ఎవ్వరిని సహించనని బాబు తన అసహనం పబ్లిక్ గా వెళ్లగక్కారు. ఇక లోకేష్ కి అయితే అందరిముందు పెద్ద క్లాస్ తీసుకుని ఎవ్వరికి నోట మాట రాకుండా చేసాడు. నాకు పార్టీ విషయాల్లో నా వారైనా పరాయి వారైనా తనకు ఒక్కటే అని అందుకే ఎవ్వరిని వదలనని డైరెక్టుగా మంత్రులకు చెమటలు పెట్టించాడని వినికిడి. ఇక ఇప్పటికే చంద్రబాబు లోకేష్ తో సహా అందరికి వార్నింగ్ లాంటి హెచ్చరికలు జారీ చేసాడు. అసలు లోకేష్ తండ్రి చెప్పిన వెంటనే పనులు చెయ్యడం లేదని ఇప్పటికే కొడుకు పై చిర్రుబుర్రులాడుతున్న బాబు ఇప్పటికీ క్లాస్ తీసుకుంటూనే వున్నాడు. మరి తండ్రిమాటని గౌరవించి లోకేష్ తన పద్దతి మార్చుకుని షార్ప్ గా తయారైతే సరి లేకుంటే లోకేష్ ని కూడా బాబు వాడలేదని ఈ విషయం చూస్తే అర్ధమవుతుంది.
మరి బాబు హెచ్చరికలు మంత్రులు చెవిన వేసుకుని తమ పని తీరు మెరుగు పరుచుకుంటారో లేక పేడ చెవిన పెట్టి పార్టీ పరువు గంగ పాలు చేస్తారో బాబు గమనిస్తూనే ఉంటాడని అందరూ చెప్పుకుంటున్నారట. ఇక బాబు మాటలు పెడచెవిన పెట్టిన మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి ఛాన్స్ ఇస్తాడేమో అని మంత్రులు తెగ భయపడుతున్నారని వినికిడి. మరి బాబా మజాకా. అసలు ఇంతకుముందే (గతంలో)బాబు మంత్రులకు, ప్రభుత్వ అధికారులకి చుక్కలు చూపించిన విషయం అందరి కి తెలుసు.
Next Story

