Mon Dec 22 2025 06:19:48 GMT+0000 (Coordinated Universal Time)
"జయమ్ము నిశ్చయమ్మురా" పాటల విడుదల !!

విడుదల తేదీ సమీపించే కొద్దీ క్రేజ్పెంచుకొంటున్న "జయమ్ము నిశ్చయమ్మురా" చిత్రంలోని రెండు పాటలను 91.1 ఎఫ్.ఎం రేడియో సిటీలో విడుదల చేశారు. దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, నిర్మాతల్లో ఒకరైన సతీష్ కనుమూరి, హీరో శ్రీనివాస్ రెడ్డి, సంగీత దర్శకులు రవిచంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన కార్తీక్, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రవివర్మ, ఈ చిత్రం ప్రదర్శన హక్కులు సొంతం చేసుకున్న ఎన్.కె.ఆర్ ఫిల్మ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి, గీత రచయితల్లో ఒకరైన రాము, సౌండ్ డిజైనర్ గీత, ఆర్.జె.సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"జయమ్ము నిశ్చయమ్మురా" పాటలను విడుదల చేసిన సౌండ్ డిజైనర్ గీత మాటాడుతూ.. "చాలా సినిమాలకు వర్క్ చేస్తుంటాం. కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సినిమాలకే పని చేస్తాం. ఇటీవలకాలంలో నేను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసిన సినిమా "జయమ్ము నిశ్చయమ్మురా". మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన కార్తీక్ చాలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. ముఖ్యగా దర్శకుడు శివరాజ్ కనుమూరి వన్ పెర్సెంట్ కూడా కాంప్రమైజ్ కాకపోవడంవలన సినిమా అద్భుతంగా వచ్చింది. "జయమ్ము నిశ్చయమ్మురా" వంటి ఓ మంచి సినిమాకు పనిచేస్తున్నందుకు చాల గర్వపడుతున్నాను" అన్నారు.
దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి మాట్లాడుతూ.. "సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ సౌండ్ ఇంజినీర్ గీత గారు మా సినిమాకు పని చేయడం, ఆవిడ చేతుల మీదుగా పాటలు విడుదల కావడం మాకు చాలా సంతోషాన్నిస్తోంది. "జయమ్ము నిశ్చయమ్మురా" సాధించబోయే విజయంలో ఆడియోతోపాటు సౌండ్ డిజైన్ కీలక పాత్ర పోషించబోతోంది" అన్నారు.
సంగీత దర్శకుడు రవిచంద్ర, చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి, గీత రచయిత రాము, చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు,ఎన్.కె.ఆర్ తదితరులు ఈనెల 25న విడుదలవుతున్న "జయమ్ము నిశ్చయమ్మురా" చాలా పెద్ద విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.
Next Story

