జబర్దస్త్ కమెడియన్స్ తో చెర్రీ సందడి

రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. ఎప్పుడు కొత్తగా తీసే సుకుమార్ ఈసారి కన్ప్యూజ్ చేయకుండా చాలా క్లారిటీతో సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో చెర్రీ లుక్ చాలా కొత్తగా ఉంది.
చాలా మంది హీరోలు సహచర నటి నటులతో ఈక్వల్ గా ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే అలాంటి వారిలో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు అని తెలుస్తుంది. ఎందుకంటే సినిమాలో నటిస్తున్న కొంత మంది కమెడియన్స్ తో చాలా సరదాగా వున్న ఓ వీడియో బయటికి వచ్చింది.
ఈ వీడియోలో జబర్దస్త్ కమెడియన్స్ చేసిన ఓ స్టంట్ కి చరణ్ సలహాలు ఇవ్వడం చాలా సరదాగా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే..దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో చివరి షెడ్యూల్ ని పూర్తి చేసి సాంగ్స్ ని షూట్ చేస్తారట. మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే.

