జనవరి 10 నుంచీ జనవరి 25 వరకూ పవన్ కళ్యాణ్ దే

తెలుగు సినీ ఇండస్ట్రీకి కాసులు తెచ్చిపెట్టే సీజన్ సంక్రాంతి సీజన్. ఈ సీజన్ కోసం నిర్మాతలు తాము నిర్మించిన సినిమాలను విడుదల చేసి లాభాలు సంపాదించాలని చాల ప్లాన్స్ వేస్తుంటారు.ఈ క్రమంలో రాబోయే సంక్రాంతి సీజన్ కి అజ్ఞాతవాసి సెగ తగిలింది. సంక్రాంతికి విడుదల అవుతాయి అనుకున్న బడా సినిమాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి.
హీరో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అజ్ఞాతవాసి. అంతకుముందు వీరిద్దరూ కలయికలో జల్సా , అత్తారింటికి దారేది వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి మెప్పించడం అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసాయి మరి ... అయితే ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ తన ప్రాణ స్నేహితుడైన పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ కొట్టాలని ఎంతో కసి మీద అజ్ఞాతవాసి చిత్రం తెరకెక్కించాడు. ఈ సంక్రాంతికి వస్తాయి అనుకున్న మహేష్ భరత్ అనే నేను సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యింది, రామ్ చరణ్ రంగస్థలం కూడా వస్తుంది అనుకున్నారు,కానీ అదికూడా అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది.
అలాగే తమిళ పెద్ద సినిమా అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో సీకేల్ 2.0 ఏప్రిల్ కు వాయిదా పడింది. ఇవన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి తొమ్మిదో తేదీనుండి జనవరి 25వ తేదీ వరకు బాక్సాఫీస్ వసూళ్ళు దున్నుకుంటూ వెళ్లిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఎదురులేని అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి. అయితే ఇదంతా హిట్ టాక్ వస్తే మాత్రమే, ట్రైలర్ చూసి అందరూ అత్తారింటికి దారేది 2 లాగా ఉంది అంటున్నారు కాబట్టి టాక్ బట్టి కథ నడుస్తుంది .

