ఛాలెంజింగ్ అంటే ఇష్టమట

'జెంటిల్మన్ , నిన్నుకోరి, జై లవ కుశ' హిట్స్ తో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అందంగా కనబడమే గ్లామర్ కాదని .. నటనతో ఆ గ్లామర్ ని కప్పెయ్యొచ్చని నిరూపించిన నివేత థామస్ ప్రస్తుతం చేతినిండా సినిమాల్తో బాగా బిజీగా వుంది. 'జంటిల్మన్, జై లవ కుశ' సినిమాల కన్నా 'నిన్నుకోరి' లో నివేత థామస్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ సినిమాలో నివేత పెరఫార్మెన్సు తో చంపేసింది. నాచురల్ స్టార్ నాని తో పోటీపడి నటించి శెభాష్ అనిపించుకుంది. అయితే నివేత థామస్ కి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం అంటే చాలా ఇష్టమట. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఉన్న స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని చెబుతుంది నివేత.
అయితే ఆ ఛాలెంజింగ్ రోల్స్ ఎలా ఉండాలో కూడా చెబుతుంది. ‘బర్ఫీ’లో ప్రియాంక చోప్రా, ‘బాజీరావ్ మస్తానీ’లో దీపికా పదుకొనే, ‘తను వెడ్స్ మను’లో కంగనా రనౌత్ చేసిన రోల్స్ లాంటి పాత్రలు చెయ్యాలని ఉందని.... చెబుతుంది. మరి నివేత అలాంటి పాత్రలు వస్తే సునాయాసంగా చేసి మెప్పించగలదు కానీ.. అలాంటి పాత్రల కోసమే వెయిట్ చేస్తానంటే మాత్రం కుదరదు. ఇకపోతే నివేత థామస్ కి సుధీర్ వర్మ - శర్వానంద్ ల కలయికలో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా అవకాశం వచ్చేలాగా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాలో ముందుగా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారని చెప్పినప్పటికీ.. ఆమెకి డేట్స్ ఖాళీ లేకపోవడంతో అనుపమ స్థానంలోకి నివేతని తీసుకునంట్లుగా చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి క్లారిటి అయితే లేదు

