చైతు వల్లనే కోట్లు పోగొట్టుకున్న నిర్మాత!

నాగచైతన్య వరుసగా హిట్ కొట్టుకుంటూ వచ్చేస్తూ మధ్యలో స్పీడు బ్రేకరులా యుద్ధం శరణంతో బ్రేక్ వేసాడు. చైతు నటించిన తాజా చిత్రం యుద్ధం శరణం విడుదలైన రెండో రోజు నుంచే వసూళ్లలో భారీ తగ్గుదల కనిపించింది. తాజాగా ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయింది. దెబ్బకి ఈ రోజు శుక్రవారం విడుదలవుతున్న సినిమాల కోసం చాలా థియేటర్ల నుంచి యుద్ధం శరణం సినిమాని తప్పించేసాడు.. దీంతో నాగచైతన్య తాజా చిత్రం ఫ్లాప్ అనే విషయం పక్కా అయ్యింది. మరి ఈ సినిమా ప్లాప్ వలన నిర్మాత ఎంత నష్టపోయాడు అంటే....
వారాహి చలనచిత్రం బ్యానర్ లో నిర్మితమైన యుద్ధం శరణం చిత్రం భారీ ప్లాపునే మూటగట్టుకుంది. ఇక ఈ మధ్యన వారాహి చలనచిత్రం బ్యానర్ లో వస్తున్న సినిమాలన్నీ ప్లాపులే అవుతున్నాయి. ఈ ఫ్లాపుల పరంపరకు యుద్ధం శరణం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఇప్పుడు ఆ బ్యానర్ ని ప్లాపుల బ్యానర్ గా అభివర్ణిస్తున్నారు. మరి యుద్ధం శరణంతో వారాహి చలనచిత్రం బ్యానర్ ఓనర్ సాయి కొర్రపాటి దాదాపు 10 కోట్ల మేర నష్టపోయినట్లుగా చెబుతున్నారు. అయితే నాగ చైతన్య ఈ చిత్రాన్ని తన స్నేహితుడు కృష్ణ అరిముత్తు దర్శకత్వంలోనే చేసాడు.
ఇక స్నేహితుడు చెప్పిన యుద్ధం శరణం కథ బాగా నచ్చడం వల్లనే ఈ సినిమా చేశానని నాగచైతన్య ఎప్పుడో చెప్పాడు. ఇక చైతు చెప్పడం వలెనే ఆ కథలోకి వేలుపెట్టడానికి నాగార్జున కూడా వెళ్లకుండా సైలెంట్ అయ్యాడట. మరి చైతు చెప్పడం వలన నాగ్ పట్టించుకోకపోవడం వలన చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాపుని మూటగట్టుకున్నాడంటున్నారు.