చెత్త సినిమా చేస్తే చెప్పులతో కొట్టండి అంటున్న హీరో!!

తెలుగులో ఒకప్పుడు సిద్దార్థ్ లవర్ బాయ్ లా వెలిగిపోయాడు. అతని సినిమా కోసం యూత్ తెగ ఎదురు చూసేది. కానీ ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అసలే ప్లాప్స్ లో ఉన్న హీరోతో ఏ దర్శక నిర్మాత అయినా ధైర్యం చేసి సినిమాలు చెయ్యరు. లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిద్దార్థ్ తో సినిమాలు చేసే వారు లేక అతని మర్కెట్ తో పాటే అతని కెరీర్ కూడా ముగిసిపోయింది... అనుకున్న సమయానికి సిద్ధు తాజాగా గృహం అనే థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.
ఘాటుగా సమాధానం...
తమిళంలో తెరకెక్కిన ఈసినిమా కి హీరో, నిర్మాత సిద్దార్థే. అయితే అక్కడ తమిళంలో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులో రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. అయితే తెలుగులో గృహం ప్రీమియర్ షో కోసం హైదరాబాద్ వచ్చిన సిద్ధుకి ఊహించని ప్రశ్న ఒకటి ఎదురైంది. కెరీర్ విషయమై ఒక విలేఖరి సిద్ధుతో మధ్యలో మీరు చాలా కాలం పడిపోయారే అని అనగా... దానికి బాగా హార్ట్ అయిన సిద్దార్థ్.. కొంచెం ఘాటుగా.. మరికొంచెం స్వీటుగా సమాధానమిచ్చాడు.
గతం గురించి అనవసరం....
అసలు నెప్పుడూ పడిపోయానని అనుకోవట్లేదు..... ఈ రోజు ఒక హీరోగా, నిర్మాతగా ఒక మంచి సినిమా తీసి.. అందరి ముందూ తలెత్తుకుని నిలబడగలిగాను. మరి నేను పడిపోయానని ఎలా అనుకుంటాను. ఆ మాట అనడం మీ ప్రాబ్లెమ్ కావచ్చు. కానీ నేను అలా అనుకోవట్లేదు. ఈ రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగితే 20 మంది నా చుట్టూ చేరి దగ్గరికి వచ్చి మరి ఫొటోలు దిగారు. కానీ వాళ్లెవ్వరూ కూడా 10 ఏళ్ల ముందైతే ఇతడితో ఫొటో దిగే వాడిని అనుకోలేదు... నాదగ్గరికి వచ్చి మరి నేనంటే ఎంతో ఇష్టమని చెప్పారు. గతం గురించి అస్సలు ఆలోచించను..... మంచి సినిమా తీస్తే ఆదరించండి..... లేదా చెత్త సినిమా తీస్తే చెప్పుతో కొట్టండి అంటూ ఘాటైన రిప్లై ఇచ్చాడు.
- Tags
- సిద్ధార్థ

