చిరు పాటకి కళ్యాణ్ టైటిల్ కి మధ్య పోటీ

మెగా స్టార్ చిరంజీవి డాన్స్ మూమెంట్స్ లో తనదైన ఈజ్ తో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే వున్నారు. ఆయన చిత్రాలలోని సూపర్ హిట్ డాన్స్ నంబర్స్ ని మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలలో పెడుతూ మెగా స్టార్ చరిష్మా కి మచ్చ రాకుండా ప్రేక్షకులని చిరు పాటలతో మెప్పించటానికి శ్రమిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఇంటెలిజెంట్ చిత్రం వచ్చే నెల 9 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో తేజు తన మామయ్య చిరు స్టెప్స్ తో అదరగొట్టిన కొండవీటి దొంగ చిత్రం లోని చమ్మక చమ్మక పాటకి కాలు కదిపి ప్రేక్షకులతో ఈలలు వేయించనున్నాడు.
ఫిదా చిత్రంతో డబల్ బ్లాక్ బస్టర్ అందుకుని మెగా ఫామిలీ లో ఎవరికీ లేని క్లాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ మరొకసారి వెంకీ అట్లూరి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో క్లాస్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ క్లాస్ లవ్ స్టోరీ కి తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సెన్సేషనల్ హిట్ ఐన తొలిప్రేమ టైటిల్ ని పెట్టి పెద్ద సాహసమే చేసాడు వరుణ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ మెగా స్టార్ పాట తో సినిమా కి హైప్ తీసుకువస్తుంటే వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ టైటిల్ తో ఆ పని చేస్తున్నాడు.
ఇంటెలిజెంట్ మరియు తొలిప్రేమ రెండు చిత్రాలు ఫిబ్రవరి 9 నే విడుదల కానుండటంతో ప్రత్యక్షంగా ఈ కుర్ర మెగా హీరోలకి, పరోక్షంగా మెగా స్టార్ మరియు పవర్ స్టార్ ల క్రేజ్ మధ్య పోటీ నెలకొననుంది.

