చిరుపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!

చిరంజీవి - అల్లు అరవింద్ కేవలం బావాబావమరుదులు మాత్రమే కాదు. వారిద్దరూ మంచి మిత్రులు కూడా. వాళ్ళ బంధం ఈనాటిది కాదు. చిరు సురేఖ ని పెళ్లి చేసుకోకమునుపునుండే.. వీళ్ళిద్దరూ మధ్యలో మంచి స్నేహం ఉందట. అలాగే నిర్మాతగా, బావగారుగా అల్లు అరవింద్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం అని చాలా సందర్బాల్లో చెప్పాడు. అయితే ఇప్పుడు బావగారు చిరంజీవి మీద బావమరిది అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అదేమిటంటే చిరంజీవి వల్ల చాలా మంది హీరోలు నష్ట పోయారు అని అల్లు అరవింద్ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. మెగా స్టార్ చిరంజీవి వల్ల మెగా హీరోలు చాలా నష్టపోయారని అరవింద్ అంటున్నాడు.
అసలు చిరంజీవి సౌత్ ఇండియా కే మెగా స్టార్. అలాంటి హోదా ని ఎవరు కంటిన్యూ చేయలేకపోయారు. రామ్ చరణ్ , అల్లు అర్జున్ స్టార్ హీరోస్ గా కొనసాగుతున్నా కూడా వాళ్ళు మెగా స్టార్ రేంజ్ కి రాలేకపోతున్నారు. వాళ్ళు ఇలా మెగా స్టార్ రేంజ్ కి ఎందుకు రాలేకపోతున్నారు అంటే.... వాళ్ళ మీద మెగాస్టార్ అనే పేరు ఒత్తిడి ఉంది. దీని వల్ల మెగా హీరోలంతా చాలా నష్టపోతున్నారు అని చెప్పి చిరంజీవి ని ఇన్ డైరెక్ట్ గా పొగిడేసాడు అల్లు అరవింద్.
మరి ఒకప్పుడు చిరంజీవి కెరీర్ లో బిజీ అయినప్పుడు అల్లు అరవింద్ దగ్గరుండి చిరంజీవి ఫ్యామిలీ వ్యవహారాలు చూసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే చిరంజీవి కెరీర్ కి అల్లు అరవింద్ చాలా హెల్ప్ చేసాడు అని చెప్పొచ్చు. చిరు ఎదుగుదలలో అరవింద్ మెయిన్ పిల్లర్ లాంటి వాడు.

