చిక్కినా ఉపయోగం లేదే

జై లవ కుశ లో స్టార్ హీరో ఎన్టీఆర్ పక్కన నటించినా ఆ హీరోయిన్ కి ఫెట్ మారలేదు. మళ్ళీ ఒకమాదిరి హీరోల పక్కన ఛాన్స్ వచ్చింది కానీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాల్లో ఒకటి ప్రేక్షకుల ముందుకు రాగా... మరొకటి మరో వారంలోనే ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది. మరి ఆ హీరోయిన్ ఎవరో మీకీపాటికే అర్ధమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు రాశి ఖన్నా. రాశి ఖన్నా నటించిన టచ్ చేసి చూసు సినిమా నిన్న శుక్రవారమే విడుదలైంది. రవితేజ సరసన నటించిన రాశి ఖన్నా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుంది. మరి ఈ సినిమాలో రాశి ఖన్నా పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. కేవలం ఫస్ట్ హాఫ్ వరకే పరిమితమయ్యే టైం పాస్ రోల్ చేసింది.
టచ్ చేసి చూసు లో రవితేజ, రాశి ఖన్నా ల లవ్ ట్రాక్ చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. రాశి ఖన్నా రొమాంటిక్ గా బోర్ కొట్టించిందని ఫీల్ అవుతున్నారు జనాలు. అసలు రాశి ఖన్నా గాని సీరత్ కపూర్ గాని టచ్ చేసి చూడు కథలో ఏమాత్రం పనికి రాని పాత్రలకు తీసుకున్నారని... క్రిటిక్స్ మొత్తం ముక్తఖంఠంతో రాసారు. అలాగే టచ్ చేసి చూడు టాక్ బావుంటే రాశి ఖన్నా కి పేరు రాకపోయినా చేతితో హిట్ ఉండేది. కానీ టచ్ చేసి చూడు టాక్ ఏమాత్రం బాగోలేదు. ఇక రాశి ఖన్నా మరో సినిమా తొలిప్రేమ మీదే ఆశలు పెట్టుకుంది.
వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లో రాశి లుక్స్ బావున్నాయని అంటున్నారు. మరి బాగా సన్నబడి అదిరిపోయే హిట్ కోసం చూస్తున్న రాశి ఖన్నా కి తొలిప్రేమ అయినా హిట్ ఇస్తుందో లేదో మరి. బొద్దుగా వున్నా రాశి ఖన్నా చిక్కి పోయినా ఫలితం కనబడట్లేదనే కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా పడుతున్నాయి.